Share News

MP Liquor Ban: మధ్యప్రదేశ్‌లో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న నగరాల్లో మద్య నిషేధం

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:10 PM

మధప్రదేశ్‌లోని మతపరమైన ప్రాముఖ్యత కలిగిన 19 నగరాలు గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి మధ్య నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రజలను మద్యపానం నుంచి దూరం చేసేందుకు సంస్కృతి పరిరక్షణకు ఇది కీలక ముందడుగు అని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పేర్కొన్నారు.

MP Liquor Ban: మధ్యప్రదేశ్‌లో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న నగరాల్లో మద్య నిషేధం
MP Liquor Ban

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఆధ్యాత్మిక ప్రాముఖత ఉన్న పలు నగరాలు, గ్రామాల్లో నేటి నుంచి మద్యనిషేధం అమల్లోకి వచ్చింది. మొత్తం 19 నగరాలు, గ్రామ పంజాయతీల్లో ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు.

రాష్ట్ర కేబినెట్ జనవరి 24న మద్యనిషేదం ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ప్రజల్లో మద్యం అలవాటును అంతమొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అప్పట్లో పేర్కొన్నారు. మతపరమైన స్థలాల పవిత్రత కాపాడేందుకు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని అని అభివర్ణించారు.

Also Read: ఝార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. లోకోపైలట్‌ల దుర్మరణం


ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో మద్యపానాన్ని నిర్మూలించేందుకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఆరు మున్సిపల్ కౌన్సిల్లు, ఆరు నగర కౌన్సిల్స్, ఆరు గ్రామపంజాయతీల్లో ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు.

ప్రజలను మద్యం మత్తు నుంచి బయటపడేసేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. ప్రజా విశ్వాసాలకు అనుగుణంగా పాలన, సంస్కృతి, మతవారసత్వ పరిరక్షణ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగానే మద్యనిషేధాన్ని అమలు చేస్తోంది. ‘‘ప్రజల విశ్వాసాలకు, పవిత్ర స్థలాలకున్న ప్రాముఖ్యతకు ఈ నిర్ణయం అద్దం పడుతోంది. మన సంస్కృతిని కాపాడుకునేందుకు, ప్రజలను మద్యం మత్తు నుంచి బయటపడేసే దిశగా ఓ అడుగు పడింది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

Also Read: వేతనజీవులకు పన్ను ఉపశమనం


మద్యనిషేధం అమల్లో ఉన్న ప్రాంతాలు ఇవే.

  • ఉజ్జయిని – పరమేశ్వరుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇదీ ఒకటి.

  • ఓంకారేశ్వర్ – మరో జ్యోతిర్లింగం ఉన్న ముఖ్యమైన యాత్రా స్థలం.

  • మహేశ్వర్ – రాణి అహల్యాబాయి హోల్కర్‌ చరిత్రతో ముడిపడిన ప్రసిద్ధ పట్టణం.

  • మండలేశ్వర్ – నర్మదా నది తీరంలో ఉన్న ఈ ప్రాంతం ఆలయాలు, ఘాట్లకు ప్రసిద్ధి.

  • ఒర్చా – రామ్ రాజా మందిరం ఉన్న ప్రసిద్ధి క్షేత్రం. ఇక్కడ భగవాన్ రాముడిని రాజుగా ఆరాధిస్తారు.

  • మైహార్ – ఇక్కడ శారదాదేవి ఆలయం ఉంది.

  • చిత్రకూట్ – రాముడి అరణ్యవాసంతో ముడిపడి ఉన్న పవిత్ర స్థలం.

  • దాటియా – ఇక్కడ శారదాంబ శక్తిపీఠం ఉంది.

  • పన్నా – ఆలయాలు, వన్యప్రాణి అభయారణ్యాల నెలవు.

  • మండ్లా – గోండు గిరిజనులకు పవిత్ర స్థలమైన సత్‌ధారా ఉన్న ప్రదేశం.

  • ముల్తాయ్ – తపతి నది జన్మస్థలం

  • మండ్సౌర్ – ఇక్కడ ప్రసిద్ధ పశుపతినాథ ఆలయం ఉంది.

  • అమర్‌కంటక్ – నర్మదా నది ఉద్భవస్థలం, ముఖ్యమైన యాత్రా కేంద్రం.

వీటితో పాటు సల్కాన్‌పూర్, కుందాల్‌పూర్, బండక్‌పూర్, బర్మన్‌కలాన్, బర్మన్‌ఖుర్ద్, లింగా గ్రామపంచాయతీల్లో కూడా నిషేధం అమల్లో ఉంది.

Read Latest and National News

Updated Date - Apr 01 , 2025 | 01:15 PM