ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumbh Mela 2025: నేటి నుంచే మహా కుంభమేళా!

ABN, Publish Date - Jan 13 , 2025 | 04:07 AM

మహా కుంభమేళా సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ మహాకుంభ మేళా మొత్తం 45 రోజుల పాటు సాగనుంది.

45 రోజుల పాటు నిర్వహణ.. కోట్లాదిగా రానున్న భక్తులు

విస్తృత ఏర్పాట్లు చేసిన యూపీ.. ఏఐ సాంకేతికతతో దిశా నిర్దేశం

ప్రయాగ్‌రాజ్‌, జనవరి 12: మహా కుంభమేళా సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తు న్న ఈ మహాకుంభ మేళా మొత్తం 45 రోజుల పాటు సాగనుంది. పుష్య పౌర్ణమి ని పురస్కరించుకుని సోమవారం తొలిపుణ్యస్నానంతో ఈ మహా క్రతువుకు యూపీ సర్కారు శ్రీకారం చుట్టనుంది. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో నిర్వహించే మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి దాదాపు 35 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళా సోమవారం లాంఛనంగా ప్రారంభం కానుండగా.. దీనికి రెండు రోజుల ముందు అంటే శనివారమే 25 లక్షల మంది ప్రజలు పవిత్ర స్నానా లు ఆచరించారని అధికారులు తెలిపారు. ఇక, మహాకుంభమేళా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తరచుగా పరిశీలించిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. దీనిని భారత దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆధునికతకు, స్వచ్ఛతకు, భద్రతకు అతి పెద్ద ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ‘‘ఇది కేవలం ఓ మతానికి సంబంధించిన కార్యక్రమం కాదు. సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీక’’ అని సీఎం ఉద్ఘాటించారు. ఇక, ప్రభుత్వ భవనాలు సహా మహా కుంభమేళా జరిగే చోట భారీ ఎత్తున హిందూ ధర్మాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే కుడ్య, తైలవర్ణ చిత్రాలను రూపొందించారు. పూర్ణ కుంభ, శంఖు ఆకృతులు భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడికక్కడ సమూహ నిర్వహణ విధానాలను అవలంభిస్తున్నారు. ఆదివారం(జనవరి 12) స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని(జాతీయ యువజన దినోత్సవం) ప్రయాగ్‌రాజ్‌లో ‘యువ మహాకుంభ్‌’ను నిర్వహించారు.

Updated Date - Jan 13 , 2025 | 04:07 AM