Maharashtra: మహారాష్ట్రలో పోటీ పరీక్షలన్నీఇక మరాఠీలోనే
ABN, Publish Date - Mar 15 , 2025 | 05:15 AM
ఇంగ్లి్‌షలో పోటీ పరీక్షలు రాసేందుకు మరాఠీ భాష విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శాసనమండలిలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
మాతృభాషలోనే ఇంజినీరింగ్ పాఠ్యపుస్తకాలు కూడా: ఫడణవీస్
ముంబై, మార్చి 14: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఎంపీఎ్‌ససీ) నిర్వహించే పోటీ పరీక్షలన్నీ ఇకపై మరాఠీలోనే జరుగుతాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఇంగ్లి్‌షలో పోటీ పరీక్షలు రాసేందుకు మరాఠీ భాష విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శాసనమండలిలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ పరీక్షలను ఎందుకు మరాఠీలో నిర్వహించడం లేదంటూ శివసేన (ఠాక్రే) సభ్యుడు మిళింద్ నర్వేకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇకపై అన్ని పరీక్షలు మాతృభాషలోనే జరుగుతాయని చెప్పారు. ఎంపీఎ్‌ససీ నిర్వహించే చాలా పరీక్షలు ఇంగ్లిష్, మరాఠీ ఉభయ భాషల్లో నిర్వహిస్తుంటారని తెలిపారు. కానీ కొన్ని టెక్నికల్ అంశాలపై మరాఠీలో పుస్తకాలు లభ్యంకానందున వాటిని ఇంగ్లి్‌షలోనే జరపాలని గతంలో కోర్టులు ఆదేశాలు ఇచ్చాయని గుర్తు చేశారు. టెక్నికల్ సబ్జెక్టులకు కూడా మరాఠీలో పుస్తకాలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నూతన విద్యావిధానం ప్రకారం మరాఠీలో కూడా ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉందని చెప్పారు. నిర్దేశిత గడువులోగా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ఎంపీఎ్‌ససీని ఆదేశించినట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..
Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 15 , 2025 | 05:15 AM