ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

U.S. Snowstorm: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం

ABN, Publish Date - Jan 07 , 2025 | 04:34 AM

అమెరికాను భారీ మంచు తుఫాను వణికిస్తోంది. మధ్య అమెరికాలో శనివారం ప్రారంభమైన ఈ విధ్వంసంతో దాదాపు 6 కోట్ల మందిపై ప్రభావం పడే ప్రమాదం నెలకొంది.

6 కోట్ల మందిపై ప్రభావం.. 6 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధింపు

వాషింగ్టన్‌, జనవరి 6: అమెరికాను భారీ మంచు తుఫాను వణికిస్తోంది. మధ్య అమెరికాలో శనివారం ప్రారంభమైన ఈ విధ్వంసంతో దాదాపు 6 కోట్ల మందిపై ప్రభావం పడే ప్రమాదం నెలకొంది. పోలార్‌ వర్టెక్స్‌ (ధ్రువపు అల్పపీడనం) కారణంగా ఈ తుఫాను సంభవించింది. దాదాపు 30 రాష్ట్రాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల రోడ్లపై మంచు 15 అంగుళాల వరకు పేరుకుపోయిందని, విజిబులిటీ కూడా సరిగా లేదని, ఇలాంటి సమయంలో ప్రయాణాలు చేయడం ప్రమాదకరమని నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ (ఎన్‌డబ్ల్యూఎస్‌) హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కెంటుకీ, వర్జీనియా, వెస్ట్‌ వర్జీనియా, కాన్సాస్‌, అర్కాన్సాస్‌, మిస్సోరి రాష్ట్రాల్లో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించారు.

Updated Date - Jan 07 , 2025 | 04:34 AM