Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్!
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:26 AM
ఉద్యోగులు పనితీరును మెరుగుప రచుకోవడం లేదని తొలగింపులకు ఉపక్రమించింది. దీంతో కొందరు ఉద్యోగులు తక్షణమే తమ కొలువులను కోల్పోతున్నట్టు బిజినెస్ ఇన్‌సైడర్ కథనం పేర్కొంది.

పనితీరు మెరుగుపరచుకోనందునే ఉద్వాసనలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. ఉద్యోగులు పనితీరును మెరుగుప రచుకోవడం లేదని తొలగింపులకు ఉపక్రమించింది. దీంతో కొందరు ఉద్యోగులు తక్షణమే తమ కొలువులను కోల్పోతున్నట్టు బిజినెస్ ఇన్‌సైడర్ కథనం పేర్కొంది. ఉద్యోగులు తమ స్థాయికి తగిన కనీస పనితీరు ప్రమాణాల ను అందుకోలేని కారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు వారికి పంపిన లేఖల్లో పేర్కొంది. తక్షణమే అన్ని విధుల నుంచి రిలీవ్ చేస్తున్నామని, మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్, అకౌంట్స్, బిల్డింగ్‌లలోకి యాక్సె్‌సను తొలగించినట్టు తెలిపింది. అయితే ఎంత మందిపై వేటు పడిందనేది తెలియరాలేదు. కాగా కంపెనీ ఇటీవల సెక్యూరిటీ, ఎక్స్‌పీరియన్సెస్, డివైజెస్, సేల్స్, గేమింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి