Akhilesh Yadav: మహాకుంభ్ మృతుల లెక్కలు దాచిపెడుతున్నారు
ABN , Publish Date - Feb 04 , 2025 | 03:47 PM
రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు లోక్‌సభలో మంగళవారంనాడు జరిగిన చర్చలో అఖిలేష్ మాట్లాడుతూ, మహాకుంభ్ ఏర్పాట్లపై మాట్లాడానికి బదులుగా ఆ ఆవెంట్‌ను ప్రచారం చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజీగా ఉందన్నారు.

న్యూఢిల్లీ: మహాకుంభ్ మేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల లెక్కలను దాచిపెడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadva) బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి అసలైన లెక్కను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు లోక్‌సభలో మంగళవారంనాడు జరిగిన చర్చలో అఖిలేష్ మాట్లాడుతూ, మహాకుంభ్ ఏర్పాట్లపై మాట్లాడానికి బదులుగా ఆ ఆవెంట్‌ను ప్రచారం చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజీగా ఉందన్నారు. 100 కోట్ల మంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అమృత్‌స్నాన్ సకాలంలో నిర్వహించడంలో విఫలమైందని, తొలిసారి అమృత్ స్నాన్ సంప్రదాయం దెబ్బతిందని అన్నారు.
Mahakumbh: మహాకుంభ్‌లో భూటాన్ రాజు
మహాకుంభ్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అసలు లెక్కల్ని ప్రభుత్వం తొక్కిపెట్టిందని అఖిలేష్ అన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు జేసీబీలను ప్రభుత్వం ఉపయోగించిందని ఆరోపించారు. మహాకుంభ్ యాత్రకు వచ్చిన కుటుంబాలకు తమ ప్రియతములను కోల్పోయి మృతదేహాలతో వెనక్కి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపిన తర్వాత 17 గంటలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారని, ఘటన జరిగినట్టు అంగీకరించారని అన్నారు.
ఆర్మీకి అప్పగించండి..
మహాకుంభ్ భద్రతా ఏర్పాట్లను ఆర్మీకి అప్పగించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం (బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) ఒకదానితో మరొకటి ఢీకొన్నాయని విమర్శించారు. కుంభమేళా మృతుల సంఖ్య, క్షతగాత్రులకు అందించిన వైద్యం, రవాణా వంటి వివరాలను పార్లమెంటుకు సమర్పించాలని, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.
చైనా ప్రస్తావన
భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని, ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని అఖిలేష్ అన్నారు. "మనం మన భూమిని కోల్పోయాం. చైనా మన భూములను, మార్కెట్‌ను కొల్లగొట్టింది'' అని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌కు మెట్రో రైలు ఇవ్వడాన్ని ఆయన ప్రశంసిస్తూనే, రాష్ట్రానికి మెట్రో రైలు తెచ్చిన ఘటన సమాజ్‌వాదీ ప్రభుత్వానిదేనని అన్నారు.
మరిన్ని వార్తల కోసం..
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి