Startups: చైనాను చూ'చి నేర్చుకోండి.. కేంద్రమంత్రి పియూష్ గోయల్

ABN, Publish Date - Apr 04 , 2025 | 03:18 PM

దేశంలోని యువ పారిశ్రామిక వేత్తలకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ గట్టి సూచనలు చేశారు. మన స్టార్టప్‌లు చిప్స్‌, ఐస్‌క్రీమ్‌ల దగ్గరే ఆగిపోవద్దన్నారు. అయితే, జెప్టో సీఈవో దీనికి కౌంటర్ ఇచ్చారు.

Startups:  చైనాను చూ'చి నేర్చుకోండి.. కేంద్రమంత్రి పియూష్ గోయల్
Piyush Goyal

Piyush Goyal: స్టార్టప్ మహా కుంబ్‌లో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ మాటలు యువతరాన్ని ఆలోచింపచేస్తున్నాయి. భారత్‌-చైనా స్టార్టప్‌ల మధ్య పోలిక తెచ్చి గోయల్ (Piyush Goyal) చేసిన వ్యాఖ్యలు యువ పారిశ్రామిక వేత్తల్లో కొత్త చర్చకు దారితీసేలా ఉన్నాయి. మన దేశంలోని చాలా అంకుర సంస్థలు(స్టార్టప్స్) ఫుడ్ డెలివరీ, బెట్టింగ్‌, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి యాప్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టాయని, కానీ చైనాలోని స్టార్టప్‌లు మాత్రం ఇందుకు భిన్నంగా ముందుకెళ్తున్నాయని తెలిపారు.

దేశంలో ప్రస్తుతం ఉన్న స్టార్టప్‌లు ఫుడ్ డెలివరీ యాప్స్‌పై దృష్టి పెట్టాయి. ఫలితంగా దేశంలో దిగువ శ్రేణి కార్మికులు తయారై సంపన్నులు కాలు బయటపెట్టకుండా ఆహారం పొందగలుతున్నారు.అంతకుమించి ఏంలేదు. ఇదే సమయంలో చైనా అంకుర సంస్థలు ఏఐ, ఈవీలు, సెమీ కండక్టర్ల రంగాలను ఎంచుకుంటున్నాయని తెలిపారు. భారత్‌లో డీప్-టెక్ స్టార్టప్‌లు పరిమిత సంఖ్యలోనే వస్తున్నాయని, ఆ రంగంలో కేవలం 1,000 స్టార్టప్‌లు మాత్రమే ఉండటం ఆందోళనకరమని అన్నారు.

ఇక్కడి యువతరం గొప్ప ఆలోచనలు కేవలం రూ.25 లక్షలు, రూ.50 లక్షలకు విదేశీ కంపెనీలకు అమ్ముడుపోతున్నాయని వాటిని మనం ఉపయోగించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త అంకుర సంస్థలు భవిష్యత్‌ తరాల కోసం దేశాన్ని సిద్ధం చేయాల్సిన అవసం ఎంతో ఉందన్నారు. మనం ఐస్‌క్రీం, చిప్స్‌ అమ్మడం దగ్గరే ఆగిపోకూడదన్నారు. స్టార్టప్ మహాకుంబ్ కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


అయితే, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలపై క్విక్‌ కామర్స్ సంస్థ జెప్టో సీఈఓ అదిత్‌ పలిచా రియాక్టయ్యారు. విమర్శించడం తేలికన్న ఆయన, ప్రస్తుతం జెప్టోలో 1.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని.. 3.5 సంవత్సరాల క్రితం అసలు ఆ సంస్థే లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. తాము పన్నులు చెల్లిస్తున్నామని, దేశంలోకి విదేశీ పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. సప్లై చైన్ ను నిర్వహించేందుకు వందల కోట్ల పెట్టుబడులు పెట్టారని తెలిపారు.

భారత ఆవిష్కరణల్లో ఇదొక అద్భుతం కాకపోతే, మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదంటూ పెదవి విరిచారు. అంతటితో ఆగని అదిత్.. భారత్‌కు భారీస్థాయిలో ఏఐ మోడల్ ఎందుకు లేదు..? ఎందుకంటే, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, అలీబాబా, గూగుల్ వంటి పెద్ద ఇంటర్నెట్‌ సంస్థలు ఇక్కడ లేవు. అవి కూడా కన్జ్యూమర్ ఇంటర్నెట్‌ కంపెనీలుగా ప్రస్థానం మొదలుపెట్టినవే. అవే ఏఐ వంటి ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్తున్నాయి. వాటి వద్ద విస్తృత డేటా, టాలెంట్, పెట్టుబడులు ఉన్నాయి. అందుకే అది సాధ్యమైంది. స్టార్టప్‌ ఎకోసిస్టమ్, ప్రభుత్వం, మూలధనాన్ని కలిగి ఉన్న యాజమాన్యాలు.. ఈ స్థానిక ఛాంపియన్లకు మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు. అప్పుడే అన్నిరంగాల్లో దేశం ముందుకెళ్లడం సాధ్యమవుతుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

AP High Court TTD Case: శ్రీనివాస దీక్షితులుకు ఏపీ హైకోర్ట్‌ షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 03:26 PM