ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: కశ్మీర్‌లో జెడ్-మోడ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని.. పాల్గొన్న నితిన్ గడ్కరీ, జమ్ము-కాశ్మీర్ సీఎం

ABN, Publish Date - Jan 13 , 2025 | 01:11 PM

శ్రీనగర్-లడఖ్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా సోన్‌మార్గ్‌లోని జెడ్‌-మోర్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సోమవారం కశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని ఆ ప్రతిష్టాత్మక టన్నెల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు జమ్ము, కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు.

PM Modi inaugurates Z-Morh tunnel

శ్రీనగర్-లడఖ్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా సోన్‌మార్గ్‌లోని జెడ్‌-మోర్ టన్నెల్‌ (Z-Morh tunnel)ను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. సోమవారం కశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని ఆ ప్రతిష్టాత్మక టన్నెల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు జమ్ము, కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. 2015లో ప్రారంభమైన ఈ నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. తాజాగా ప్రధాని ఈ టన్నెల్‌ను ప్రారంభించారు (Z-Morh tunnel inauguration).


సెంట్రల్ కశ్మీర్‌ (Kashmir)లోని గాంధర్‌బల్ జిల్లాలో నిర్మించిన ఈ సొరంగ మార్గాన్ని రూ.2400 కోట్ల రూపాయలతో దాదాపు పదేళ్ల పాటు నిర్మించారు. సముద్ర మట్టానికి 8, 650 అడుగుల ఎత్తులో 6.4 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఈ సొరంగా మార్గం 7.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ సొరంగం ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ శ్రీనగర్, సోనామార్గ్‌కు కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంతకు ముందు ఈ రహదారి గుండా గంటకు 30 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణం చేయాల్సి వచ్చింది.


తాజా టన్నెల్‌తో వేగ పరిమితి గంటకు 70 కి.మీ. పెరగనుంది. ఈ టన్నెల్ గుండా గంటకు వెయ్యి వాహనాలు రాకపోకలు సాగించవచ్చు. ఏడాది పొడవునా ఈ టన్నెల్ ద్వారా కనెక్టివిటీ ఉంటుంది. శీతాకాలంలో తీవ్ర హిమపాతం ఉన్నప్పటికీ రవాణాకు ఆటంకం లేకుండా టన్నెల్ ద్వారా ప్రయాణం సాగించవచ్చు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 13 , 2025 | 01:11 PM