ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prayagraj: టెంట్‌ సిటీ.. ప్రయాగ్‌రాజ్‌!

ABN, Publish Date - Jan 12 , 2025 | 05:30 AM

ప్రయాగ్‌రాజ్‌.. ఇప్పుడు టెంట్‌ సిటీ! నదిలో.. నదీ తీరంలో.. ఖాళీ స్థలాల్లో.. త్రివేణీ సంగమం నుంచి దాదాపు పది కిలోమీటర్ల పరిధిలో కనుచూపు మేరలో ఎక్కడ చూసినా టెంట్లే! వీటిలో కనీస సదుపాయాలతో కూడిన మామూలు టెంట్ల నుంచి టీవీలు, సీసీటీవీ కెమెరాలతో కూడిన అత్యంత విలాసవంతమైన టెంట్లు కూడా ఉన్నాయి.

దాదాపు 2 లక్షల వరకూ టెంట్ల ఏర్పాటు

(ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి)

ప్రయాగ్‌రాజ్‌.. ఇప్పుడు టెంట్‌ సిటీ! నదిలో.. నదీ తీరంలో.. ఖాళీ స్థలాల్లో.. త్రివేణీ సంగమం నుంచి దాదాపు పది కిలోమీటర్ల పరిధిలో కనుచూపు మేరలో ఎక్కడ చూసినా టెంట్లే! వీటిలో కనీస సదుపాయాలతో కూడిన మామూలు టెంట్ల నుంచి టీవీలు, సీసీటీవీ కెమెరాలతో కూడిన అత్యంత విలాసవంతమైన టెంట్లు కూడా ఉన్నాయి. గంగా నదిలో దాదాపు లక్ష టెంట్లతో ఏకంగా ఓ టెంట్‌ సిటీనే ఏర్పాటు చేశారు! ఇందుకు ఏకంగా 68 లక్షల కర్రలు, పైకప్పుల కోసం ఏకంగా 250 టన్నుల సీజీఐ షీట్లు ఉపయోగించారని అంచనా. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం 2లక్షలకుపైగా టెంట్లను ఏర్పాటు చేశారని అంచనా! వీటిలో ఏకకాలంలో 20 లక్షల మందికి వసతి కల్పించవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ఉచితంగా ఇచ్చేవి కాగా.. మరికొన్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తూ రూ.80 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేసేవి!

టెంట్లు.. అనేక రకాలు..!

ఉచిత టెంట్లు కొన్ని.. విలాసవంతమైన టెంట్లు కొన్ని! సిబ్బందికి ఒక రకం! అధికారులకు మరో రకం! రాజకీయ నాయకులకు ఇంకో రకం! వీటిలో కొన్ని మామూలు టెంట్లు.. మరికొన్ని అగ్ని ప్రమాదం జరిగినా చెక్కుచెదరని ఫైర్‌ ప్రూఫ్‌ టెంట్లు! ఇలా.. వివిధ వర్గాల వారికి ప్రయాగ్‌రాజ్‌లో టెంట్లు ఏర్పాటు చేశారు. ఉదాహరణకు, ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సర్వోదయ మండలి రెండు టెంట్లను ఏర్పాటు చేసింది. ఎక్కడా వసతి దొరకని వారికి ఇక్కడ ఉచితంగానే.. ఒక్కో టెంట్‌లో 30 మందికి వసతి కల్పిస్తామని దాని బాధ్యులు చెప్పారు. భక్తులకు ఉచితంగా వసతి కల్పించేందుకు కొందరు సేవాభావంతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు, మరికొందరు టెంట్లలో వసతితోపాటు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం, మాధవుడు, బడే హనుమాన్‌, అక్షయ్‌ వట్‌ దర్శనం తదితరాలతో కూడిన ప్యాకేజీలనూ అందిస్తున్నారు. డిమాండ్‌, సౌకర్యాలను బట్టి ఈ ప్యాకేజీలు రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకూ పలుకుతున్నాయి.

ఇక, ఐఆర్‌సీటీసీ కూడా వాణిజ్య ప్రాతిపదికన సూపర్‌ లగ్జరీ టెంట్లు, విల్లాలను ఏర్పాటు చేసింది. వీటికి రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తోంది. అలాగే, ప్రయాగ్‌రాజ్‌లో భద్రతను పర్యవేక్షించే పోలీసులు, ఐబీ, ఇంటెలిజెన్స్‌, ఇతర అధికారులు కూడా తమ తమ అవసరాల మేరకు ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. కొన్నిచోట్ల దాదాపు 80 గజాల స్థలంలో డబుల్‌ బెడ్‌రూం టెంట్లు ఏర్పాటు చేశారు. వీటిలో ముందు భాగంలో చిన్న సోఫాతో ఆఫీసు రూం.. వెనక బాత్‌రూం మధ్యలో రెండు బెడ్‌ రూంలు వరుసగా ఏర్పాటు చేశారు. మరికొన్నిచోట్ల 40-50 గజాల చిన్న టెంట్‌లోనే దాదాపు 15-20 మంచాలను ఏర్పాటు చేసి దాదాపు 40 మంది వరకూ ఉండేలా వసతి కల్పిస్తున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 05:30 AM