Share News

Wakf Amendment Bill: వక్ఫ్‌ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం

ABN , Publish Date - Apr 06 , 2025 | 02:30 AM

వక్ఫ్‌ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలపగా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దీన్ని ముస్లింలపై దాడిగా విమర్శించారు. ఈ బిల్లుపై సుప్రీంకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలవ్వగా, భవిష్యత్‌లో ఇతర మతాలపై దాడులకు ఇదో ఉదాహరణగా రాహుల్‌ వ్యాఖ్యానించారు.

Wakf Amendment Bill: వక్ఫ్‌ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: వక్ఫ్‌ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ శనివారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఈ బిల్లు బుధవారం లోక్‌సభలో, గురువారం రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇదిలా ఉండగా, వక్ఫ్‌ సవరణ బిల్లు ముస్లింలపై దాడేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ శనివారం అన్నారు. భవిష్యత్‌లో దేశంలో ఇతర మతాలపై జరగనున్న దాడులకు ఇదో ఉదాహరణ వంటిదని పేర్కొన్నారు. వక్ఫ్‌ బిల్లు ఆమోదం తర్వాత ఆర్‌ఎ్‌సఎస్‌ క్యాథలిక్‌ చర్చి భూములపై దృష్టి సారించిందని పేర్కొంటూ ఆరెస్సెస్‌ అనుబంధ పత్రికలో వచ్చిన ఒక వార్తా కథనాన్ని దానికి జోడించారు. ఇక క్రిస్టియన్లపై దృష్టి సారించడానికి ఆర్‌ఎ్‌సఎ్‌సకు ఎంతో సమయం పట్టదని రాహుల్‌ తన పోస్టులో వివరించారు. ఇదిలా ఉండగా, వక్ఫ్‌ సవరణ బిల్లును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 02:30 AM