Share News

Jagjit Singh Dallewal: నిరాహార దీక్ష విరమించిన రైతు నేత దల్లేవాల్‌

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:26 AM

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి రైతు డిమాండ్ల కోసం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఆదివారం విరమించారు. కేంద్ర మంత్రుల అభ్యర్థనపై ఫతే్‌హగఢ్‌ సాహిబ్‌లో జరిగిన కిసాన్‌ మహాపంచాయత్‌లో దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు.

Jagjit Singh Dallewal: నిరాహార దీక్ష విరమించిన రైతు నేత దల్లేవాల్‌

ఛంఢీగఢ్‌, ఏప్రిల్‌ 6: రైతు డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పంజాబ్‌ రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఆదివారం విరమించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్ల సాధన కోసం గతేడాది నవంబరు 26న ఆయన ఈ నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌, రైల్వే శాఖ సహాయ మంత్రి రన్‌వీత్‌ సింగ్‌ బిట్టు శనివారం జగ్జీత్‌ను కలిసి దీక్ష విరమించాల్సింగా కోరగా, మర్నాడే ఆయన దీక్ష విరమించారు. ఆదివారం పంజాబ్‌ ఫతే్‌హగఢ్‌ సాహిబ్‌ జిల్లాలో నిర్వహించిన ‘కిసాన్‌ మహాపంచాయత్‌’లో దల్లేవాల్‌ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, మే 4న రైతులతో చర్చలు జరుగుతాయని దల్లేవాల్‌ను కలిసిన అనంతరం శివరాజ్‌ చౌహన్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

'అమెరికాను నాశనం చేయడం ఆపండి'

ట్రంప్ టారిఫ్‌ల కల్లోలం

జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి

Read Latest and International News

Updated Date - Apr 07 , 2025 | 04:26 AM