Share News

Jaipur Accident: తాగి వాహనం నడిపిన రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేత

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:11 AM

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేత ఉస్మాన్‌ ఖాన్‌ మద్యం మత్తులో వాహనం నడిపి ముగ్గురి ప్రాణాలు తీసారు. జైపూర్‌ నహర్‌గఢ్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Jaipur Accident: తాగి వాహనం నడిపిన రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేత

పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

జైపూర్‌, ఏప్రిల్‌ 8: తప్ప తాగి వాహనం నడిపిన ఓ రాజస్థాన్‌ నేత కారణంగా ముగ్గురు అమాయకులు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం జైపూర్‌లోని నహర్‌గఢ్‌ ప్రాంతంలో జరిగింది. వ్యాపారవేత్త, జైపూర్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడైన ఉస్మాన్‌ ఖాన్‌ (62) పూటుగా మందుతాగి కారు నడిపారు. నహర్‌గఢ్‌ ప్రాంతంలో ఇరుకైన రోడ్డులో వెళ్తుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయిన ఆయన ముందు వెళ్తున్న ఓ ద్విచక్రవాహనంతో పాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పలువురు పాదచారులను ఢికొట్టి ఆగకుండా కారును అలాగే ముందుకు పోనిచ్చారు. నహర్‌గఢ్‌ పోలీసు స్టేషన్‌ ముందు ఆగి ఉన్న బైక్‌లను ఢీకొని కారు ఆగింది. ఉస్మాన్‌ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Apr 09 , 2025 | 03:12 AM