Share News

Muskan Rastogi: పుట్టేది సౌరభ్‌ బిడ్డే అయితే దత్తత తీసుకుంటాం

ABN , Publish Date - Apr 09 , 2025 | 02:59 AM

ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన ముస్కాన్‌ రస్తోగికి గర్భం దాల్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. భర్త సౌరభ్‌ సోదరుడు, "జన్మించేది అతని బిడ్డే అయితే, దత్తత తీసుకుంటాం" అని ప్రకటించారు.

Muskan Rastogi: పుట్టేది సౌరభ్‌ బిడ్డే అయితే దత్తత తీసుకుంటాం

మేరఠ్‌, ఏప్రిల్‌ 8: ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య ముస్కాన్‌ రస్తోగి కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భం దాల్చినట్టు వైద్య పరీక్షలో తేలినట్టు అధికారులు తెలిపారు. మర్చంట్‌ నేవీ అధికారి అయిన సౌరభ్‌ రాజ్‌పుత్‌ను ఆమె.. ప్రియుడు సాహిల్‌ శుక్లాతో కలిసి నరికి ముక్కలు చేసింది. ప్రస్తుతం జైలులో ఉన్న ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా గర్భందాల్చినట్టు తేలింది. దీనిపై సౌరభ్‌ సోదరుడు స్పందించారు. జన్మించేది సౌరభ్‌ బిడ్డే అయితే తాము దత్తత తీసుకుంటామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Updated Date - Apr 09 , 2025 | 02:59 AM