Spoiled Food: కుక్కల తిండిలో కక్కుర్తి
ABN, Publish Date - Mar 26 , 2025 | 04:06 AM
పోలీసు డిపార్ట్‌మెంట్‌లోని ఐఎస్‌డబ్ల్యూ విభాగం డీఎస్పీ శ్రీనివాసరావు నాసిరకమైన ఆహారం కుక్కలకు ఇచ్చి ఆరు జాగిలాల మరణానికి కారణమయ్యాడు. దీనిపై హోంశాఖ చర్యలు తీసుకుంటూ, సంబంధిత అధికారులపై వివిధ తప్పులపై విచారణ జరిపింది.

నాసిరకం ఆహారంతో ఆరు పోలీసు జాగిలాలు మృతి
8ఐదుగురు ఖాకీలపై హోంశాఖ చర్యలు
అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జాగిలాలకు పెట్టే తిండిలోనూ కక్కుర్తిపడి.. వాటికి నాసిరకం ఆహారం పెట్టి ఆరు కుక్కల మరణానికి కారణమైన పోలీసు అధికారిపై హోంశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఆయనతోపాటు పోలీసుశాఖలో భాగమైన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ)లో మరో నలుగురిపైనా చర్యలు తీసుకుంటూ మంగళవారం జీవో జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి పోలీసు బెటాలియన్‌లో ఐఎ్‌సడబ్ల్యూ విభాగానికి చెందిన డీఎస్పీ శ్రీనివాసరావు నిబంధనలకు విరుద్ధంగా 35 కుక్కపిల్లలను కొనుగోలు చేశారు. శిక్షణ ఇచ్చే క్రమంలో డబ్బులు మిగుల్చుకోవడం కోసం వాటికి నాసిరకమైన ఆహారం పెట్టారు. దీంతో వాటికి జబ్బుచేసి నీరసించాయి. ఆరు కుక్కలు ప్రాణాలు కోల్పోయాయి. ఎవరికీ తెలియకుండా వాటి స్థానంలో వేరే కుక్కపిల్లల్ని తెచ్చిపెట్టారు. దీనిపై విచారణ జరిపిన పోలీసు శాఖ ప్రభుత్వానికి నష్టం కలిగించిన శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడంతో హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇదే బెటాలియన్‌లో వాహనాలు తిప్పకుండానే ఏడాది పాటు డీజిల్ కొట్టించినట్లు చూపించి నిధులు కాజేసిన డీఎస్పీ కోటేశ్వరరావు, ఆర్‌ఐ సతీశ్ కుమార్, ఎస్‌ఐ కృష్ణపైనా చర్యలు తీసుకొంటూ జీవో జారీచేసింది. ఇలాంటి తప్పుల్ని కనిపెట్టకుండా అలసత్వం వహించిన నాన్ కేడర్ ఎస్పీ భాస్కర రెడ్డి (రిటైర్డ్) పైనా అభియోగాలు నమోదు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 26 , 2025 | 04:20 AM