స్కైరూట్ కలాం-100 ఇంజన్ పరీక్ష సక్సెస్
ABN, Publish Date - Apr 08 , 2025 | 05:59 AM
హైదరాబాద్ ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్కైరూట్ తన విక్రమ్-1 రాకెట్‌కు శక్తినిచ్చే కలాం-100 ఇంజన్ ఫైర్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ టెస్ట్‌లో 100 కేఎన్ పీక్ వాక్యూమ్ థ్రస్ట్ ఉత్పత్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్కైరూట్.. తన విక్రమ్-1 రాకెట్‌కు శక్తినిచ్చే 3వ దశ ఇంజన్ కలాం-100కు ఫైర్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది. పరీక్ష సమయంలో రాకెట్ 100 కేఎన్ పీక్ వాక్యూమ్ థ్రస్ట్‌ను ఉత్పత్తి చేసిందని ప్రకటించింది. కచ్చితమైన థ్రస్ట్ వెక్టర్ కోసం అధునాతన ఫ్లెక్స్ నాజిల్‌ను ఉపయోగించి కలాం-100 ఇంజన్‌ను 102 సెకన్లపాటు మండించినట్టు తెలిపింది. ‘స్కైరూట్ విక్రమ్-1 మిషన్‌లో కీలక ముందడుగు పడింది. కలాం-100కు స్టాటిక్ ఫైర్ టెస్ట్ విజయవంతమైంది’ అని పేర్కొంది
Updated Date - Apr 08 , 2025 | 05:59 AM