Spiritual Moment: అయోధ్య రాముడికి సూర్య తిలకం

ABN, Publish Date - Apr 07 , 2025 | 03:55 AM

శ్రీరామనవమి రోజున అయోధ్య రామమందిరంలో మధ్యాహ్నం 12గంటలకు రాముడి విగ్రహ నుదిటిపై సూర్య తిలకం ప్రదర్శితమైంది. ఈ ఆధ్యాత్మిక దృశ్యం నాలుగు నిమిషాల పాటు కొనసాగగా, వేలాది మంది భక్తులు దీన్ని తిలకించి ఆనందించారు.

Spiritual Moment: అయోధ్య రాముడికి సూర్య తిలకం

రామ మందిరంలో ఆవిష్కృతమైన సుందర దృశ్యం

అయోధ్య, ఏప్రిల్‌ 6: శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం అయోధ్యలోని రామమందిరంలో మనోహర దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. బాల రాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతమయింది. సరిగ్గా మధ్యాహ్నం 12గంటలకు సూర్య కిరణాలు రామ విగ్రహం నుదిటిని తాకాయని, 4నిమిషాల పాటు ఆ దృశ్యం కొనసాగిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ తెలిపింది. సూర్యకాంతితో రాముడికి మహా మస్తకాభిషేకం జరిగిందని తెలిపింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధనియాలతో చేసిన ప్రసాదాన్ని, ఫలాలతో చేసిన లడ్డూలను స్వామికి నివేదించారు.


ఇవి కూడా చదవండి:

'అమెరికాను నాశనం చేయడం ఆపండి'

ట్రంప్ టారిఫ్‌ల కల్లోలం

జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి

Read Latest and International News

Updated Date - Apr 07 , 2025 | 03:57 AM