SpaceX: ఐఎస్ఎస్ ను ను చేరిన స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక
ABN, Publish Date - Mar 17 , 2025 | 05:06 AM
ఆదివారం 9.37గంటలకు(భారత కాలమానం ప్రకారం) అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)తో అనుసంధానమైంది. ఈ వ్యోమ నౌక ఐఎ్‌సఎ్‌సకు అనుసంధానం కాగానే.. ఐఎ్‌సఎ్‌సలో ఉన్న ఏడుగురు సిబ్బంది వ్యోమ నౌకలో ఉన్న నలుగురు వ్యోమగాములకు స్వాగతం పలికారు.

న్యూఢిల్లీ, మార్చి 16: స్పేస్ ఎక్స్ సంస్థ శనివారం ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్-10(వ్యోమ నౌక పేరు).. ఆదివారం 9.37గంటలకు(భారత కాలమానం ప్రకారం) అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)తో అనుసంధానమైంది. ఈ వ్యోమ నౌక ఐఎస్ఎస్ కు అనుసంధానం కాగానే.. ఐఎ్‌సఎ్‌సలో ఉన్న ఏడుగురు సిబ్బంది వ్యోమ నౌకలో ఉన్న నలుగురు వ్యోమగాములకు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. వీరు ఇదే వ్యోమ నౌకలో భూమ్మీదకు రానున్నారు.
షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఐఎ్‌సఎస్ నుంచి బయల్దేరుతారు. గురువారం అర్ధరాత్రి కల్లా ఈ వ్యోమనౌక భూమని చేరే అవకాశం ఉంది. సునీత, విల్మోర్‌లతో పాటు అమెరికాకు చెందిన నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా రానున్నారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది
MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్
Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..
Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 17 , 2025 | 05:43 AM