Share News

Dadi Ratan Mohini: బ్రహ్మ కుమారీస్‌ అధినేత్రి దాది రతన్‌ మోహిని కన్నుమూత

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:01 AM

బ్రహ్మకుమారీస్‌ అధినేత్రి దాది రతన్‌ మోహిని (100) మంగళవారం కన్నుమూశారు. ఆధ్యాత్మిక సేవలకు గుర్తింపుగా ఆమెకు అనేక పురస్కారాలు, గౌరవాలు లభించాయి.

Dadi Ratan Mohini: బ్రహ్మ కుమారీస్‌ అధినేత్రి దాది రతన్‌ మోహిని కన్నుమూత

సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి

జైపూర్‌, ఏప్రిల్‌ 8: బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధినేత్రి దాది రతన్‌ మోహిని కన్నుమూశారు. వందేళ్లు దాటిన దాది రతన్‌ మోహిని.. ఇటీవల ఆరోగ్యం సరిగా లేక అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1925 మార్చి 25న జన్మించిన దాది రతన్‌ మోహిని అతి పిన్న వయసులో బ్రహ్మ కుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చేరారు. ప్రపంచమంతా సంచరించి ఆధ్యాత్మిక ప్రగతికి కృషి చేశారు. జాతి, మత భేదాలకు అతీతంగా ఆధ్యాత్మిక చైతన్యం కలిగించి ఎందరికో మార్గ దర్శకులయ్యారు. తన విశేష సేవలకు గాను డాక్టరేట్‌తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. దాది రతన్‌ మోహిని మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక బలానికి, నిర్మలత్వానికి, విశ్వ సోదర భావానికి నిలువెత్తు నిదర్శనంగా ఆమె నిలిచారని రేవంత్‌ కొనియాడారు. ఆమె మరణం రాష్ట్రానికి, దేశానికి, విశ్వ ఆధ్యాత్మికతకు తీరని లోటన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Updated Date - Apr 09 , 2025 | 03:01 AM