Share News

Kunal Kamra: మూడోసారీ పోలీసుల విచారణకు హాజరు కాని కునాల్‌ కమ్రా

ABN , Publish Date - Apr 06 , 2025 | 02:45 AM

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై స్టాండ్‌-అప్‌ కమేడియన్‌ కునాల్‌ కమ్రా మూడోసారి కూడా పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ముంబయి పోలీసులు ఇచ్చిన సమన్లను ఆయన విస్మరించగా, హైకోర్టు ఈ నెల 7వ తేదీ వరకు అరెస్ట్‌ చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చింది.

Kunal Kamra: మూడోసారీ పోలీసుల విచారణకు హాజరు కాని కునాల్‌ కమ్రా

ముంబయి, ఏప్రిల్‌ 5: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాండ్‌అప్‌ కమేడియన్‌ కునాల్‌ కమ్రా మూడోసారి కూడా పోలీసుల విచారణకు హాజరు కాలేదు. శనివారం తమ ఎదుట హాజరు కావాలంటూ ముంబయి పోలీసులు ఇచ్చిన సమన్లను విస్మరించారు. ప్రస్తుతం ఆయన తమిళనాడులో ఉంటున్నారు. ఈ నెల ఏడో తేదీ వరకు ఆయనను అరెస్టు చేయకూడదని ఆదేశిస్తూ హైకోర్టు మందస్తు బెయిల్‌ ఇచ్చింది. తొలుత పోలీసులు ముంబయిలోని ఆయన నివాసానికి వెళ్లి సమన్లు అందజేయడానికి ప్రయత్నించారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో వాట్సప్‌ ద్వారా పంపించారు. అంతకుముందు రెండుసార్లు సమన్లు పంపినా వాటికి స్పందించలేదు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యలు చేసిన కమ్రా...షిండే పేరు పెట్టకుండానే ‘మోసగాడు’ అంటూ విమర్శలు చేశారు. దీనిపై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పలు చోట్ల కేసులు పెట్టారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 02:45 AM