ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: శంభల్‌ మసీదు బావిపై యథాతథ స్థితి

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:45 AM

వివాదాస్పదంగా మారిన ఉత్తరప్రదేశ్‌లోని శంభల్‌లో ఉన్న షాహీ జామా మసీదుపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.

జోక్యం చేసుకోవద్దు.. అధికారులకు సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ, జనవరి 10: వివాదాస్పదంగా మారిన ఉత్తరప్రదేశ్‌లోని శంభల్‌లో ఉన్న షాహీ జామా మసీదుపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అక్కడ యథాతథ పరిస్థితిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. అక్కడ ఉన్న ‘ప్రయివేటు బావి’ జోలికి పోకూడదని, సర్వేలు జరపకూడదని పురావస్తు సర్వే విభాగానికి సూచించింది. అక్కడి శాంతిభద్రతల పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు పేర్కొంది. శంభల్‌లో జిల్లా అధికారులు జరుపుతున్న తవ్వకాలను సవాలు చేస్తూ షాహీ జామా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అక్కడి పరిస్థితులపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.

సుప్రీంకోర్టును సందర్శించొచ్చు

సామాన్యులకు సుప్రీంకోర్టు ద్వారాలు తెరుచుకున్నాయి. ఇకపై సర్వోన్నత న్యాయస్థానం ప్రాంగణంలోకి వెళ్లి అక్కడి విశేషాలను తిలకించవచ్చు. శనివారం రోజుల్లో సందర్శకులకు ఈ అవకాశం కలిగిస్తున్నామని పేర్కొంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ మహేష్‌ టి పట్నాకర్‌ గురువారం సర్క్యులర్‌ జారీ చేశారు. ఆసక్తికల వారు ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేసుకొని టైమ్‌ స్లాట్‌ను బుక్‌ చేసుకోవాలి. తప్పకుండా గైడ్‌ సాయంతోనే ప్రాంగణంలో తిరగాలి. గంట పాటు కోర్టు హాళ్లను తిలకించవచ్చు.

సుప్రీంకోర్టు పేరుతో నకిలీ వెబ్‌సైట్లు

సుప్రీంకోర్టు పేరిట నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తున్న సైబర్‌ దాడుల అంశంపై అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ తాజాగా పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. నకిలీ వెబ్‌సైట్లను సృష్టించడంతో పాటు యూఆర్‌ఎల్‌(యూనిఫామ్‌ సర్వీస్‌ లొకేటర్‌)లను జనరేట్‌ చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నకిలీ వెబ్‌సైట్ల జాబితాను నోటీసులో ప్రస్తావించింది.

Updated Date - Jan 11 , 2025 | 04:46 AM