Tamil Nadu: అత్యాచారం చేస్తే మరణశిక్ష
ABN, Publish Date - Jan 11 , 2025 | 04:40 AM
మహిళలపై అత్యాచార ఘటనలను అడ్డుకునేందుకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
చట్ట ముసాయిదాకు తమిళనాడు ఆమోదం
చెన్నై, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మహిళలపై అత్యాచార ఘటనలను అడ్డుకునేందుకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష విధించే చట్టసవరణ బిల్లును సీఎం స్టాలిన్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా అది ఆమోదం పొందింది. ఇది చట్టరూపం దాలిస్తే.. మహిళల వెంటపడినా, వారిని వేధించినా నేరంగా పరిగణించి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 18 ఏళ్లలోపు బాలికలపై సామూహిక వేధింపులకు పాల్పడితే జీవిత కారాగార శిక్ష విధిస్తారు. యాసిడ్ దాడి వంటి కేసుల్లో నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించేలా ఈ బిల్లును రూపొందించారు.
Updated Date - Jan 11 , 2025 | 04:41 AM