Privilege Motion: జైశంకర్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం
ABN , Publish Date - Mar 02 , 2025 | 05:52 AM
అమెరికా నుంచి భారతీయుల బహిష్కరణకు సంబంధించి సభను తప్పుదోవ పట్టించే విధంగా, అసంపూర్తి సమాచారాన్ని అందించారని ఆరోపిస్తూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌పై టీఎంసీ సభ్యురాలు సాగరికా ఘోష్ శుక్రవారం సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలేజ్ మోషన్)ను ప్రవేశపెట్టారు.

న్యూడిల్లీ, మార్చి 1: అమెరికా నుంచి భారతీయుల బహిష్కరణకు సంబంధించి సభను తప్పుదోవ పట్టించే విధంగా, అసంపూర్తి సమాచారాన్ని అందించారని ఆరోపిస్తూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌పై టీఎంసీ సభ్యురాలు సాగరికా ఘోష్ శుక్రవారం సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలేజ్ మోషన్)ను ప్రవేశపెట్టారు. ‘‘వలసదారులను నిర్బంధించడం, వారిపట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి అంశాలను అమెరికా అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని విదేశాంగ మంత్రి ఫిబ్రవరి 6న సభలో స్పష్టంగా చెప్పారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చూస్తామని తెలిపారు. ఆ తర్వాత తొమ్మిది రోజులకు బహిష్కరణకు గురైన మరో 116 మంది భారతీయులను సంకెళ్లతో బంధించిన విమానం ఫిబ్రవరి 15న భారత్‌కు వచ్చింది. అసలు భారత్ ఈ అంశాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లిందా, లేదా అనేదానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది సభను తప్పుదోవ పట్టించడమే’’ అని ఘోష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.