ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HMPV: దేశంలో ఏడుకు చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు

ABN, Publish Date - Jan 08 , 2025 | 05:12 AM

దేశంలో మరో రెండు హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌ (హెచ్‌ఎంపీవీ) కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ, జనవరి 7: దేశంలో మరో రెండు హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌ (హెచ్‌ఎంపీవీ) కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు పెరిగింది. మంగళవారం నాగ్‌పూర్‌లో ఇద్దరికి ఈ వైరస్‌ సోకినట్టు గుర్తించారు. ఇంతవరకు బెంగళూరులో రెండు, సేలం, అహ్మదాబాద్‌, చెన్నైల్లో ఒక్కొక్క కేసు వంతున నమోదయింది. బాధితులంతా మూడు నెలల నుంచి 13 ఏళ్లలోపు ఉన్న పిల్లలే. ఇది కొత్త వైరస్‌ ఏమీ కాదని, 2001లోనే గుర్తించారని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పారు. ఫ్లూ లక్షణాలతో ఉన్న జ్వరం వస్తుందని, దీనికి ఎలాంటి యాంటీ బయోటిక్స్‌ వాడాల్సిన పనిలేదని తెలిపారు. తగినన్ని నీళ్లు తాగాలని, పారాసిటమాల్‌ మాత్రలు, జ్వరం, వళ్లు నొప్పులు నివారించే మందులతో ఇది తగ్గుతుందని తెలిపారు.

Updated Date - Jan 08 , 2025 | 05:23 AM