Share News

Vande Bharat : చినాబ్‌ వంతెనపై వందేభారత్‌ చుక్‌ చుక్‌!

ABN , Publish Date - Jan 26 , 2025 | 04:49 AM

జమ్మూ-కశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రెయిసీలోని చినాబ్‌ రైల్వే వంతెనపై వందేభారత్‌ రైలు పరుగులు తీసింది. ఈ మేరకు సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ను శనివారం రైల్వేశాఖ

Vande Bharat : చినాబ్‌ వంతెనపై వందేభారత్‌ చుక్‌ చుక్‌!

ప్రపంచంలో ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్‌పై సుందర దృశ్యం.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

శ్రీనగర్‌, జనవరి 25: జమ్మూ-కశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రెయిసీలోని చినాబ్‌ రైల్వే వంతెనపై వందేభారత్‌ రైలు పరుగులు తీసింది. ఈ మేరకు సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ను శనివారం రైల్వేశాఖ విజయవంతంగా నిర్వహించింది. కాట్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్‌ నుంచి శ్రీనగర్‌ వరకు ఈ రైలు ప్రయాణించింది. మార్గమధ్యలో చినాబ్‌ వంతెనపై ఈ రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. దీనికి సంబంధించి నెట్‌లో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. చినాబ్‌ వంతెన ఎత్తు నదీగర్భం నుంచి 359 మీటర్లు. ఈ వంతెన పొడవు 1,315 మీటర్లు. కశ్మీర్‌లోని మిగతా ప్రాంతాలను అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చినాబ్‌ బ్రిడ్జిని నిర్మించారు. ప్యారి్‌సలోని ఈఫిల్‌ టవర్‌తో పోల్చితే చినాబ్‌ రైల్వే వంతెన ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. ఉధంపూర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 272 కి.మీ మేర ట్రాక్‌ నిర్మించారు.

Updated Date - Jan 26 , 2025 | 04:49 AM