Viral Video: శోభనం గదిలో కొత్త జంటకు షాకిచ్చిన బంధువులు..
ABN, Publish Date - Mar 14 , 2025 | 03:23 PM
కొత్తగా పెళ్లిన ఓ జంటకు బంధువులు ఊహించని షాక్ ఇచ్చారు. బంధువులు చేసిన పనికి పాపం కొత్త జంట అల్లాడిపోయింది. శోభనం రాత్రి కాస్తా.. మర్చిపోలేని కాళరాత్రిగా మారిపోయింది.

కొత్తగా పెళ్లయిన వారి జీవితంలో శోభనం అన్నది ఓ మరుపురాని ఘట్టం. అలాంటి శోభనం సమయంలో ఓ కొత్త జంటకు బంధువులు షాక్ ఇచ్చారు. వారి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రాత్రిగా దాన్ని మార్చేశారు. వారు చేసిన పనికి శోభనం రాత్రి కాస్తా.. కాళరాత్రిగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం ఉత్తర భారత దేశానికి చెందిన ఓ వ్యక్తికి పెళ్లయింది. అతగాడు ఎంతగానో ఎదురు చూస్తున్న శోభనం రోజు రానే వచ్చింది. రాత్రి ఎంతో ఉత్సాహంగా శోభనం గదిలోకి వెళ్లాడు. భార్య కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉన్నాడు. కొద్ది సేపటి తర్వాత తలుపు చప్పుడు అయింది. ఉత్సాహంగా తలుపు తెరిచాడు. అక్కడ భార్య లేదు. బంధువులు ఉన్నారు. దండుపాళ్యం బ్యాచ్‌లాగా వాళ్లు గదిలోకి తోసుకువచ్చేశారు. శోభనం జరగాల్సి బెడ్ మీద పడుకున్నారు. ఏం చేయాలో వరుడికి అర్థం కాలేదు. పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయాడు.
ఆ తర్వాత పెళ్లి కూతురు వచ్చింది. గదిలో ఉన్న వాళ్లను చూసి ఆశ్చర్యపోయింది. చేసేది ఏమీ లేక, అక్కడే నేలపై దుప్పటి పరిచి కూర్చుండిపోయింది. కొద్దిసేపటికి బంధువులు హాయిగా నిద్రపోయారు. నేలపై కూర్చొన్న పెళ్లి కూతురు కూడా నిద్రపోయింది. పెళ్లి కొడుకు మాత్రం బాధతో బంధువుల వైపు చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకుపైగా వ్యూస్ తెచ్చుకుంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వీడియోపై కామెంట్లు పెడుతున్నారు. ‘ నువ్వింకా ముసలోడివి కాలేదు. కృంగిపోకు తమ్ముడూ’.. ‘ రేయ్ ఎవర్రా మీరంతా?’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
శోభనం రోజే ప్రాణాలు తీసేశాడు..
అయోధ్యలో ఓ దారుణమైన సంఘటన జరిగింది. శోభనం గదిలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ని చంపేశాడు. అనంతరం ఉరి వేసుకుని చనిపోయాడు. శోభనం గదిలోకి వెళ్లిన జంట ఉదయం 7 గంటలు అయినా బయటకు రాలేదు. దీంతో కుటుంబసభ్యులు గది తలుపు కొట్టారు. లోపలినుంచి ఎలాంటి స్పందన రాలేదు. తలుపు బద్దలు కొట్టి, లోపలికి వెళ్లగా.. పెళ్లి కూతురు బెడ్‌పై నిర్జీవంగా పడి ఉంది. పెళ్లి కొడుకు ఫ్యాన్‌కు వేళాడుతూ ఉన్నాడు. డాక్టర్‌ను పిలిపించగా.. ఇద్దరూ చనిపోయారని ధ్రువీకరణ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి మరణానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..
Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 14 , 2025 | 03:26 PM