Share News

Waqf Amendment Act: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం.. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల

ABN , Publish Date - Apr 08 , 2025 | 07:12 PM

వక్ఫ్ బిల్లుపై లోక్‌సభలో, రాజ్యసభల్లో చర్చ అనంతరం ఏప్రిల్ 4న ఓటింగ్ జరగడంతో రెండు సభల్లోనూ బిల్లు నెగ్గింది. లోక్‌సభలో 288-232, రాజ్యసభలో 128-95 ఓట్ల తేడాతో బిల్లు గట్టెక్కింది.

Waqf Amendment Act: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం.. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ: పార్లమెంటులో గత వారం ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం ఈరోజు (ఏప్రిల్ 8) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారంనాడు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణం ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. గత వారంలో పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు-2025పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 5న సంతకం చేశారు. దాంతో వక్ఫ్ బిల్లు చట్టరూపం దాల్చింది. వక్ఫ్ బిల్లుపై లోక్‌సభలో, రాజ్యసభల్లో చర్చ అనంతరం ఏప్రిల్ 4న ఓటింగ్ జరగడంతో రెండు సభల్లోనూ బిల్లు నెగ్గింది. లోక్‌సభలో 288-232, రాజ్యసభలో 128-95 ఓట్ల తేడాతో బిల్లు గట్టెక్కింది.

Rahul Gandhi: ఆ టీచర్లకు న్యాయం చేయండి.. రాష్ట్రపతి జోక్యం కోరుతూ రాహుల్ లేఖ


మరోవైపు, వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ పలు పార్టీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై అత్యున్నన న్యాయస్థానం ఏప్రిల్ 16న విచారణ జరపనుంది. కేంద్రం సైతం కేవియట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నేటి నుంచే వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

Supreme Court Closes NTA Case: ఎన్‌టీఏపై కేసును మూసివేసిన సుప్రీంకోర్టు

Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం

For National News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 07:27 PM