ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhogi : భోగ భాగ్యాలనిచ్చే బొమ్మల కొలువు

ABN, Publish Date - Jan 12 , 2025 | 06:14 AM

సంక్రాంతి అనగానే గుర్తొచ్చే ప్రధాన వేడుక బొమ్మల కొలువు. దీనిని భోగి నాడు ప్రారంభించి కనుమ పండుగ రోజు వరకు కొనసాగిస్తారు. బొమ్మల కొలువుని మూడు, అయిదు, తొమ్మిది మెట్ల వారీగా పేర్చడం తెలుగువారి సంప్రదాయం. ఓ పద్ధతి ప్రకారం మెట్ల మీద బొమ్మలను అందంగా అమరుస్తారు.

సంక్రాంతి అనగానే గుర్తొచ్చే ప్రధాన వేడుక బొమ్మల కొలువు. దీనిని భోగి నాడు ప్రారంభించి కనుమ పండుగ రోజు వరకు కొనసాగిస్తారు. బొమ్మల కొలువుని మూడు, అయిదు, తొమ్మిది మెట్ల వారీగా పేర్చడం తెలుగువారి సంప్రదాయం. ఓ పద్ధతి ప్రకారం మెట్ల మీద బొమ్మలను అందంగా అమరుస్తారు.

  • మొదటి మెట్టు మీద చిన్న ఇళ్లు, గుడులు, గోపురాలు, పొలాలు, రకరకాల చెట్లు, పూల తీగలు లాంటి ప్రకృతి సంబంధిత బొమ్మలు పేరుస్తారు.

  • రెండో మెట్టు మీద శంఖం, చేప, తాబేలు, నత్త, పీత, ఇతర జలచరాల బొమ్మలు పెడతారు.

  • మూడు, నాలుగు మెట్ల మీద చిన్న క్రిమి కీటకాల బొమ్మలు, చీమలు, తుమ్మెదలు, తేనెటీగల బొమ్మలు అమరుస్తారు.

  • అయిదో మెట్టు మీద రకరకాల పక్షులు, జంతువుల బొమ్మలను కనువిందుగా పెడతారు.

  • ఆరో మెట్టు మీద మనుషుల బొమ్మలు, ఏడో మెట్టుమీద మహనీయుల బొమ్మలు పెడతారు

  • ఎనిమిదో మెట్టుమీద అష్ట దిక్పాలకులు, నవ గ్రహాల నాయకులు, పంచభూతాల బొమ్మలు పేరుస్తారు.

  • తొమ్మిదో మెట్టు మీద త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల బొమ్మలతోపాటు సరస్వతి, లక్ష్మి, పార్వతి బొమ్మలను పెడతారు.


వినాయకుడు, కుమారస్వామితో ఉన్న శివ పార్వతుల బొమ్మ.... చిన్న బాబుని ఎత్తుకున్న తల్లి, ఆవు దూడ, పంచాంగం చదువుతున్న బ్రాహ్మణుడు, పెద్ద ముత్తైదువ, పచారీ కొట్టు కోమటి బొమ్మలను తప్పనిసరిగా బొమ్మల కొలువులో ఉంచుతారు. కాల క్రమంలో మట్టి బొమ్మలు, స్వాతంత్య్ర సమరయోధుల బొమ్మలు, వాహనాల బొమ్మలు, బార్బీ బొమ్మలు, పింగాణీ బొమ్మలు కూడా ఈ కొలువులో చోటు సంపాదించుకున్నాయి. ఏటా ఓ కొత్త బొమ్మను తప్పనిసరిగా కొని కొలువులో పెడతారు.

  • బొమ్మల కొలువు పెట్టిన తరవాత చుట్టు పక్కల ఉండే మహిళలందరిని పేరంటానికి పిలుస్తారు. బొమ్మలకు ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. బొమ్మల కొలువు చూడడానికి వచ్చిన ముతైదువలను పసుపు, కుంకుమ, తాంబూలంతో సత్కరించి గోదాదేవి బొమ్మనిచ్చి పంపుతారు. బొమ్మల కొలువు పెట్టిన ఇల్లు భోగభాగ్యాలతో వర్థిల్లుతుందని ఒక నమ్మకం.

  • కొన్ని ప్రాంతాల్లో రాజు, రాణి, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, మేళతాళాలు, పెళ్లితంతు బొమ్మలు పెట్టి బొమ్మల పెళ్లి చేసే వేడుక కూడా ఉంది.

బొమ్మల పెట్టె

  • బొమ్మల కొలువులో పెట్టే బొమ్మలను జాగ్రత్తగా దాచడానికి ఓ చెక్క పెట్టె ఉంటుంది. బొమ్మలన్నింటినీ కాగితాలు లేదా సన్నని బట్టలో చుట్టి ఈ పెట్టెలో పెడతారు. దీనిని ఎవరూ ముట్టుకోకుండా ఇంట్లో అటక మీద భద్ర పరుస్తారు.

  • బొమ్మల కొలువు పెట్టే రోజున ఈ పెట్టెను జాగ్రత్తగా కింది దించుతారు. ఇంట్లోని పురుషులు అంటే తాత, తండ్రి, పినతండ్రి కలిసి పెట్టెకు పూజ చేసి హారతి ఇస్తారు. పిల్లల చేత చప్పట్లు కొట్టిస్తూ ఆనందోత్సాహాల మధ్య పెట్టె తెరుస్తారు. ఇది భోగినాడు జరిగే అద్భుతమైన వేడుక.

Updated Date - Jan 12 , 2025 | 06:15 AM