The Roshans : మూడు తరాల కథ
ABN, Publish Date - Jan 12 , 2025 | 06:11 AM
ప్రస్తుతం ఓటీటీల్లో సినీ సెలబ్రిటీల డాక్యుమెంటరీల ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో వస్తున్న మరో డాక్యుమెంటరీ ‘ది రోషన్స్’. బాలీవుడ్‌లో ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన రోషన్స్ ఫ్యామిలీకి సంబంధించిన
ప్రస్తుతం ఓటీటీల్లో సినీ సెలబ్రిటీల డాక్యుమెంటరీల ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో వస్తున్న మరో డాక్యుమెంటరీ ‘ది రోషన్స్’. బాలీవుడ్‌లో ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన రోషన్స్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. అగ్రహీరో హృతిక్ రోషన్ సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత, కుటుంబ విశేషాలను ఇందులో ప్రముఖంగా చూపించనున్నారు. అలాగే వారి కుటుంబంలోని మూడు తరాల గురించి ఇందులో చూపించబోతున్నారు. హృతిక్‌రోషన్ తండ్రి రాకేశ్ రోషన్, తాతయ్య రోషన్‌లాల్ నగ్రత్ సినీ పరిశ్రమకు అందించిన సేవలను ఆవిష్కరించనున్నారు. అనిల్ కపూర్, షారూఖ్‌ఖాన్, ప్రియాంక చోప్రా లాంటి సన్నిహితులు రోషన్స్ కుటుంబం గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు అభిమానులు అలరించనున్నాయి. ఈ డాక్యుమెంటరీకి శశిరంజన్ దర్శకుడు.
Updated Date - Jan 12 , 2025 | 06:11 AM