ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కోరికలు, ఆందోళనలే ఆటంకాలు

ABN, Publish Date - Mar 14 , 2025 | 02:54 AM

ఒకప్పుడు బర్మాలో కొందరు వ్యక్తులు ఒక పెద్ద బౌద్ధాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆలయం చాలా అందంగా, వైభవంగా ఉండాలనీ, మరీ ముఖ్యంగా ఆలయ ముఖద్వారం మనోహరంగా కనిపించాలని...

సద్బోధ

ఒకప్పుడు బర్మాలో కొందరు వ్యక్తులు ఒక పెద్ద బౌద్ధాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆలయం చాలా అందంగా, వైభవంగా ఉండాలనీ, మరీ ముఖ్యంగా ఆలయ ముఖద్వారం మనోహరంగా కనిపించాలని అనుకున్నారు. దానికోసం ఒక నమూనాను తయారు చేయాలనీ ఒక బౌద్ధ సన్యాసిని కోరారు. అతను ఎన్నో ఆలయాల నమూనాలు రూపొందించి పేరు ప్రఖ్యాతులు పొందాడు. పైగా ఆ రంగంలో చాలా నైపుణ్యం ఉన్న శిష్యుడు అతనికి ఉన్నాడు. ఆ ఆలయం కోసం పని చెయ్యడానికి ఆ సన్యాసి ఒప్పుకున్నాడు.

గురుశిష్యులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. గురువు ఒక నమూనా గీసి, శిష్యుడికి చూపించాడు. దాన్ని శిష్యుడు శ్రద్ధగా, నిశితంగా పరిశీలించి... ఆశించినంత గొప్పగా లేదన్నాడు. గురువు మరొకటి తయారు చేశాడు. శిష్యుడికి అదీ నచ్చలేదు. ఇలా సన్యాసి ఎన్ని తయారు చేసినా... అవి బాగోలేవని శిష్యుడు చెప్పడంతో... వాటిని అతను పక్కన పడేశాడు. ఇలా మూడు నెలలు గడిచాయి. ఒక రోజు మరొక నమూనాను గురువు తయారు చేస్తున్నాడు. ఈలోగా అతని కలంలోని సిరా చివరికి వచ్చేసింది. కాగితం మీద గీతలు సరిగ్గా పడడం లేదు. ‘‘బజారుకు వెళ్ళి సిరా తీసుకురా!’’ అని శిష్యుణ్ణి పంపాడు. తరువాత అతను కలంలో ఉన్న సిరాతోనే అక్కడక్కడా కొన్ని మార్పులు చేసి ఒక నమూనా రూపొందించాడు.


కొద్దిసేపటికి తిరిగి వచ్చిన శిష్యుడు దాన్ని చూసి ఆనందాశ్చర్యాలతో ‘‘గురువుగారూ! ఇది చాలా అద్భుతంగా ఉంది. ఆలయ నిర్మాతలు కూడా దీన్ని తప్పకుండా అంగీకరిస్తారు. ఇది ఎలా సాధ్యమయింది?’’ అని అడిగాడు.

అప్పుడు గురువు ఒక్క క్షణం ఆలోచించి ‘‘నువ్వు ఇక్కడే, నా సమక్షంలో ఉన్నంత సేపూ నువ్వు మెచ్చుకొనే విధంగా నమూనాను తయారు చేయాలనే కోరిక నాలో ఉండేది. ‘అది జరగదేమో?’ అనే ఆందోళన కూడా నా మనసులో ఉండేది. ఆ కోరిక, ఆందోళనలే సరైన నమూనా రూపొందించడంలో ఆటంకాలయ్యాయి. దాంతో అన్నీ వ్యర్థమయ్యాయి. నువ్వు బయటకు వెళ్ళాక... నీ గురించి పూర్తిగా మరచిపోయాను. నా సహజమైన తీరులో... ఎలా తోస్తే అలా గీశాను. కోరిక, ఆందోళన లేని మనసు చక్కటి దారిలో నా చేతిని నడిపించింది. అందుకే ఈ నమూనాలో ఆ అందం కనిపిస్తోంది’’ అని చెప్పాడు.


నాట్యం, గానం, చిత్రలేఖనం, గ్రంథపఠనం, ప్రసంగం... ఇలా ఏది చేస్తున్నా అందరి మెప్పు పొందాలనే కోరిక, ఎవరు ఎలా స్పందిస్తారోననే ఆందోళన, భయం ఉన్నప్పుడు... ఆ పనులను సవ్యంగా నిర్వహించలేం. ‘‘ఇదంతా ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం ఉంటే ఆ పనులు ఇంకా భ్రష్టుపడతాయి. ఇవేవీ లేకపోతే మనం చేసే పనులు అద్భుతంగా ఉంటాయి. సత్ఫలితాలను ఇస్తాయి. ‘నేను’ అనే భావన నీలో లేనప్పుడు... దైవం నీలో ప్రవేశించి, నిన్ను నడిపిస్తాడు’’ అంటారు స్వామి వివేకానంద. అలా చేసే కార్యం విజయవంతం కాకతప్పదు.

రాచమడుగు శ్రీనివాసులు

ఈ వార్తలు కూడా చదవండి:

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..

Fish and Mutton prices: బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన మటన్, చేపల రేట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..

Updated Date - Mar 14 , 2025 | 02:54 AM