Exercises: కాళ్లకీ కావాలి వ్యాయామం
ABN, Publish Date - Mar 15 , 2025 | 01:40 AM
కాళ్లలో కదలికలు సక్రమంగా ఉంటేనే నడవడం, పరుగెత్తడం, సమతుల స్థితిలో నిలబడడం సాధ్యమవుతుంది. కాళ్లు ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు నిపుణులు సూచిస్తున్న వ్యాయామాలు ఇవే...

మోకాళ్లను వంచండి...
దీనిలో ఒక మోకాలును ముందుకు వంచి రెండో మోకాలును నేరుగా పెట్టాలి. దీనివల్ల తొడలు, కాళ్లలో పేరుకున్న అదనపు కొవ్వు కరుగుతుంది. మోకాళ్లను సులభంగా వంచగలుగుతారు. పాదాల్లోని కండరాలు బలపడతాయి.
కుర్చీలో కూర్చున్నట్లు...
ఒక కుర్చీలో కూర్చున్నట్లు ఊహించుకోండి. కొద్దిగా అటూ ఇటూ కదలండి. ఇలా రోజుకు 15 నిమిషాలు చేస్తే కాళ్లలో సత్తువ పెరుగుతుంది. మోకాళ్ల కీళ్లు బలపడతాయి. తొడల కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
కేరింతలు...
చిన్నపిల్లలు పడుక్కొని కాళ్లు చేతులు పైకి కిందికీ ఊపుతూ ఉంటారు. ఎయిర్‌సైక్లింగ్ కూడా ఇలాంటిదే. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఎయిర్ సైక్లింగ్ చేస్తే కాళ్లలో బిగుసుకున్న కండరాలు వ్యాకోచం చెందుతాయి. వెన్ను నొప్పి తగ్గుతుంది.
సగం వంగి...
చాలా మంది సులభంగా వంగలేరు. కాళ్లను మడవటానికి కూడా ఇబ్బంది పడతారు. ఇలాంటి వారు కాళ్లను సగం వంచి అటూ ఇటూ కదిలితే... నడుము భాగం నుంచి పాదాల వరకూ ఉన్న కండరాల నొప్పులు, తిమ్మిర్లు తగ్గిపోతాయి. కీళ్లవాతం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
ఇవి కూడా చదవండి..
BS Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎంకు స్వల్ప ఊరట
Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
Bengaluru: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. విషయం ఏంటంటే..
Divya: నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..
Updated Date - Mar 15 , 2025 | 01:40 AM