Share News

Cleaning Tips: ఇంట్లో దుమ్ము చేరితే

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:56 AM

ఇంట్లో ఉపకరణాల మీద, గది మూలల్లో దుమ్ము చేరుతూ ఉంటుంది. ఇలా ఇంట్లో దుమ్ము పేరుకోకుండా ఉండేందుకు నిపుణులు సూచిస్తున్న చిట్కాల గురించి తెలుసుకుందాం.

Cleaning Tips: ఇంట్లో దుమ్ము చేరితే

సాధారణంగా ఇంట్లో చీపురుతో ఊడుస్తూ ఉంటాం. దీనివల్ల కొన్ని దుమ్ము కణాలు పైకి లేచి పక్కనే ఉన్న వస్తువులపై పడుతుంటాయి. నేలమీద కూడా కొన్ని కణాలు అలాగే మిగిలి ఉంటాయి. చీపురుతో కాకుండా వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో ఇంటిని శుభ్రం చేస్తే దుమ్ము పూర్తిగా తొలగిపోతుంది. అలాగే వారానికి ఒకసారి ఇంటిని తడిగుడ్డతో తుడవాలి.

చెప్పులు, షూస్‌ లాంటివి ఎక్కువగా దుమ్మును ఇంట్లోకి తీసుకొస్తాయి. వీటిని ఇంటి బయటే వదలడం వల్ల సగం సమస్య తీరుతుంది. మూడు రోజులకు ఒకసారి డోర్‌మ్యాట్‌, కార్పెట్‌ లాంటివాటిని వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి.

కొంతమంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటారు. ఈ చెప్పులను బయటికి వేసుకెళ్లకుండా ఇంట్లోనే వాడుకుంటూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.


ఇంట్లో దుప్పట్లు, సోఫా కవర్లు, కర్టెన్ల మీద ఎక్కువగా దుమ్ము పడుతూ ఉంటుంది. వీటిని తీసి గట్టిగా దులిపి మళ్లీ వేస్తూ ఉంటారు. ఇలా దులిపినప్పుడు దుమ్ము కణాలు లేచి ఇల్లంతా వ్యాపిస్తాయి. కాబట్టి వీటిని దులపకుండా వారానికి ఒకసారి సబ్బు నీళ్లలో నానబెట్టి ఉతకడం మంచిది.

ఇంటి తలుపులు, వెంటిలేటర్లు, కిటికీల మూలలు, వాటి ఊచల మీద కూడా విపరీతంగా దుమ్ము నిలుస్తూ ఉంటుంది. డెటాల్‌ లేదా సబ్బు నీళ్లలో ముంచిన గుడ్డతో వీటిని తరచూ తుడుస్తుంటే ఆ ప్రదేశాల్లో దుమ్ము పేరుకోదు.

ఇంట్లో ఉండే అరల్లో ఎక్కువగా దుమ్ము, ధూళి చేరుతూ ఉంటాయి. పదిహేను రోజులకు ఓసారి క్లీనింగ్‌ డస్టర్‌ సహాయంతో వీటిని శుభ్రం చేస్తే సరిపోతుంది.


ఇవి కూడా చదవండి..

Supreme Court Closes NTA Case: ఎన్‌టీఏపై కేసును మూసివేసిన సుప్రీంకోర్టు

Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం

For National News And Telugu News

Updated Date - Apr 09 , 2025 | 01:57 AM