ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

healthy lifestyle: నిద్ర లేవగానే ఇలా...

ABN, Publish Date - Jan 08 , 2025 | 04:10 AM

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం.

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. దీనిని అలవరచుకోవడానికి ఉదయం వేళలు అనుకూలంగా ఉంటాయి. నిద్రలేవగానే ఏ అలవాట్లు పాటించాలో తెలుసుకుందాం!

వేడి నీళ్లు తాగాలి:

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. ఇందులో రెండు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా తేనె కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా సమతౌల్యంలో ఉంటుంది. జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగై శరీరమంతా పరిశుభ్రమవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

యోగా చేయాలి:

పొద్దున్నే కనీసం ఇరవై నిమిషాలు యోగా చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేసినా భుజంగాసనాలు వేసినా శరీరంలోని కండరాలు చురుకుగా మారతాయి. శరీరాన్ని సాగదీసే ఆసనాలు వేస్తే రక్తప్రసరణ వ్యవస్థ మెరుగై అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. సులభమైన యోగాసనాలు రోజూ వేస్తూ ఉంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.


నడవాలి:

పొద్దున్నే పచ్చని చెట్ల మధ్య లేదంటే ఏదైనా పార్కులో కనీసం అరగంట నడవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. రెట్టింపు శక్తితో పనులు చేసుకోవచ్చు. కోపం, ఒత్తిడి, ఆందోళన, గుండె జబ్బులు, మధుమేహం దరిచేరవు. శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ అంది మెదడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. క్రమం తప్పకుండా నడక అలవాటు చేసుకుంటే జీవక్రియలు సమన్వయంగా పనిచేసి ఊబకాయం రాకుండా చేస్తాయి.

అల్పాహారం తినాలి:

ఉదయం పూట ప్రోటీన్లతో కూడిన అల్పాహారం తీసుకోవడం మంచిది. ప్రోటీన్లు ఆకలిని నియంత్రించడమే కాకుండా శక్తిని అందిస్తాయి. గ్రీన్‌ టీ, గుడ్లు, ఓట్స్‌, పండ్లు, గింజలు, మొలకలు, సలాడ్స్‌, పన్నీరు, బఠానీలు, ఆవిరిమీద ఉడికించినవాటిని అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది.

Updated Date - Jan 08 , 2025 | 04:10 AM