ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Makeup: మచ్చలు మటుమాయం చేసేలా...

ABN, Publish Date - Jan 04 , 2025 | 04:28 AM

ముఖం మీద మొటిమలు, గాట్లు, పుట్టుమచ్చల్లాంటి వాటిని దాచేయాలంటే, కొన్ని మేకప్‌ మెలకువలు అనుసరించాలి. అవేంటో తెలుసుకుందాం!

ముఖం మీద మొటిమలు, గాట్లు, పుట్టుమచ్చల్లాంటి వాటిని దాచేయాలంటే, కొన్ని మేకప్‌ మెలకువలు అనుసరించాలి. అవేంటో తెలుసుకుందాం!

కన్‌సీలర్‌తో: మచ్చల రంగును బట్టి వాటిని కనిపించకుండా చేసే కన్‌సీలర్‌ ఎంచుకోవాలి. మచ్చ ఎర్రగా ఉండే గ్రీన్‌ టింట్‌ కలిగి ఉండే కన్‌సీలర్‌ అద్దుకోవాలి. నల్లగా ఉంటే, ఎరుపు రంగు కన్‌సీలర్‌ ఎంచుకోవాలి. ఇందుకోసం మేకప్‌ స్పాంజ్‌తో ఈ కన్‌సీలర్‌ పలుచగా అద్దుకుని, ఆ తర్వాత సాధారణ కన్‌సీలర్‌ను మచ్చ ఉన్న ప్రదేశంలో అద్దుకోవాలి. ఇందుకోసం మేకప్‌ స్పాంజ్‌ మీద కన్‌సీలర్‌ వొంపి, మచ్చతో పాటు, దాని చుట్టూరా అద్దుకోవాలి.

ఫౌండేషన్‌ ఇలా: కన్‌సీలర్‌ అద్దుకున్న తర్వాత మేకప్‌ స్పాంజ్‌తో ఫౌండేషన్‌ పూసుకోవాలి. అసహజమైన గీతలు కనిపించకుండా, ముఖం మొత్తం ఫౌండేషన్‌ సమంగా పరుచుకునేలా స్పాంజ్‌తో అద్దుకోవాలి. తర్వాత మేకప్‌ దవడ ఎముక దిగువ వరకూ బ్లెండ్‌ చేయాలి. తర్వాత పెద్ద బ్రష్‌తో లూజ్‌ మ్యాట్‌ పౌడర్‌ను తీసుకుని, వృత్తాకారంలో ముఖం మీద అద్దుకోవాలి. మచ్చ మీద పౌడర్‌ పరుచుకోవడం వల్ల, అది చర్మంలో కలిసిపోతుంది.

Updated Date - Jan 04 , 2025 | 04:28 AM