ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ అర్హత పొందేది అప్పుడే...

ABN, Publish Date - Jan 03 , 2025 | 06:49 AM

‘‘అర్జునా! ఇంద్రియాలతో విషయాల సంయోగం వల్ల..., క్షణికమైన సుఖాలు, దుఃఖాలు కలిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అవి అనిత్యమైనవి. శీతాకాలంలా, ఎండాకాలంలా వస్తూ పోతూ ఉంటాయి. వాటి వల్ల కలత చెందకుండా... అంటే సుఖం వచ్చినప్పుడు...

గీతాసారం

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః

ఆగమాపాయినో నిత్యాః స్తాం స్తితీక్షస్వ, భారత!

‘‘అర్జునా! ఇంద్రియాలతో విషయాల సంయోగం వల్ల..., క్షణికమైన సుఖాలు, దుఃఖాలు కలిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అవి అనిత్యమైనవి. శీతాకాలంలా, ఎండాకాలంలా వస్తూ పోతూ ఉంటాయి. వాటి వల్ల కలత చెందకుండా... అంటే సుఖం వచ్చినప్పుడు సంతోషపడకుండా, కష్టం వచ్చినప్పుడు దుఃఖపడకుండా... ఓర్పుతో వాటిని సహించాలి’’ అని ఈ గీతాశ్లోకంలో శ్రీకృష్ణుడు బోధించాడు. సమకాలీన సమాజంలో ఈ భావాన్నే ‘అది కూడా దాటిపోతుంది’ అని వ్యక్తీకరిస్తూ ఉంటాం. అనుభవాత్మకమైన స్థాయిలో మనం దీన్ని అలవాటు చేసుకోగలిగితే... ఈ ద్వంద్వాలను అధిగమించ గలుగుతాం, వాటిని సమానంగా చూడగలుగుతాం.


మనకు చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ అనే అయిదు ఇంద్రియానుభూతులు ఉన్నాయి. వాటిని వ్యక్తీకరించే భౌతిక సాధనాలు... కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. సంబంధిత అవయవాల ద్వారా వచ్చే సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి మెదడులో కూడా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క భాగం ఉంటుంది. ఇంద్రియ సాధనలకు అనేక పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు కన్ను ఒక రకమైన పౌనఃపున్యంగల కాంతిని మాత్రమే క్రమబద్ధం చెయ్యగలదు. దీన్నే మనం ‘దృశ్యమాన కాంతి’ (విజిబుల్‌ లైట్‌) అంటాం. ఇక రెండో విషయమేంటంటే... కన్ను సెకెనుకు 15 బొమ్మల కన్నా ఎక్కువ గుర్తించలేదు. తెరపై చూసినప్పుడు మనకు ఆనందాన్ని ఇచ్చే వీడియోలు, సినిమాల సృష్టి వెనుక సూత్రం ఇదే. మూడోది... దేన్నయినా చూడడానికి కనీసం కొంత కాంతి అయినా అవసరం. ఇంద్రియాలకు ఉన్న ఈ పరిమితులు ‘సత్‌’ (శాశ్వతం), ‘అసత్‌’ (అశాశ్వతం) మధ్య తేడాను గమనించే మన సామర్థ్యానికి అడ్డుపడతాయి. తాడుని చూసి చుట్టుకున్న పాము అని భ్రమ పడేలా చేస్తాయి.


ఈ భౌతిక పరికరాలకు అనుబంధంగా ఉండే మెదడులోని భాగాలు కూడా ఈ పరికరాలకు ఉన్న పరిమితుల కారణంగా వైకల్యానికి గురి అవుతాయి. ప్రత్యేకించి, మన బాల్యంలో పెంపకం ద్వారా మనకు నేర్పిన అంశాల వల్ల... మెదడులోని కొన్ని కణాలైన న్యూరాన్లు ప్రత్యేకమైన నిర్మాణాన్ని సంతరించుకుంటాయి. దీన్నే ‘హార్డ్‌ వైరింగ్‌’ అంటారు. ఇది ప్రేరేపితమైన అవగాహనను కలిగిస్తుంది. అంటే మనం దేన్ని చూడాలనుకుంటున్నామో దాన్నే చూసేలా చేస్తుంది. ‘సత్‌’ను చూడలేని ఈ అసమర్థత, ‘అసత్‌’ వైపు ఒరిగే స్వభావం దుఃఖానికి కారణం అవుతాయి. సుఖం, దుఃఖం లాంటి ధ్రువాలు దాడి చేసినప్పుడు మనం సంతులనంతో ఉండగలిగితే... అంటే వివేకంతో సుఖ, దుఃఖాలను సమానంగా చూస్తూ, వాటి వల్ల బాధపడకుండా ఉన్నప్పుడు... అమృతానికి (మోక్షానికి) అర్హత సంపాదించుకుంటామని...

యం హి న వ్యథయం త్యే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే... అనే శ్లోకంలో శ్రీకృష్ణుడు అభయం ఇచ్చాడు.

కె. శివప్రసాద్‌

ఐఎఎస్‌

Updated Date - Jan 03 , 2025 | 06:50 AM