ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Healthy Diet: శాకాలు... పోషకాల నిధులు

ABN, Publish Date - Jan 04 , 2025 | 04:15 AM

అంటాడు భోజన కుతూహల రచయిత రఘనాథ సూరి. ఆహారంలో శాకాలది ప్రధానమైన భాగస్వామమని దీని అర్థం.

‘‘మూల పత్ర కరీరాగ్ర ఫల కాండాధిరూఢకా

త్వక్‌ పుష్పం కవకంచేతి శాకం దశవిధం స్మృతమ్ఢ్ఢ్‌’’

అంటాడు భోజన కుతూహల రచయిత రఘనాథ సూరి. ఆహారంలో శాకాలది ప్రధానమైన భాగస్వామమని దీని అర్థం. దుంప కూరలు, ఆకు కూరలు, చిగుర్లు, పండ్లు, కాయలు, కాడలు, మొలకలు, బెరళ్లు, పూలు, పుట్టగొడుగులు... వీటిని మనం తరచూ తింటూ ఉంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇప్పుడు మనం వీటిగురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

శాకాలలో చాలా పోషకపదార్థాలు ఉంటాయి. ఇవి రూపం మారినప్పుడు వాటిలో పోషక విలువలు కూడా మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు ఽఒక గింజను నానబెట్టి వుంచితే మొలకలొస్తాయి. ఈ మొలకల నుంచి కూరగాయలు పండుతాయి. మొలకలలో పోషక విలువలు.. కూరగాయల్లో పోషక విలువలు వేర్వేరుగా ఉంటాయి. అయితే ఈ శాకాలను తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకే రకం కూరగాయని విడవకుండా తింటే అస్థిభేదక (ఎముకలు దెబ్బతినటం). నేత్రశక్తి నాశక (కంటి చూపు మందగించటం), రక్తశుక్రనాశక (రక్త కణాల్ని, పురుషుల్లో జీవకణాల్ని నశింపచేయటం), ప్రఙ్ఞాక్షయం (మేథశక్తిని హరిస్తుంది), ఫాలిత్యకారక (జుట్టు నెరిసిపోతుంది), స్మరణ శక్తి నాశక (ఙ్ఞాపక శక్తిని నశింప చేస్తుంది) అని భావప్రకాశ అనే ఆయుర్వేద గ్రంథం వివరించింది. కాబట్టి ప్రతి రోజూ ఒకే రకం కూరగాయలు కాకుండా ఒక రోజు దుంపకూర, ఒకరోజు ఆకు కూర, ఒకరోజు కాయగూర ఇలా ఆరు రకాల్నీ మార్చిమార్చి తినాలనేది ఆయిర్వేద నిపుణుల చెబుతూ ఉంటారు. దీనికి తగిన విధంగానే మన ఆహార ప్రణాళిక కూడా ఉండాలి. అంతే కాకుండా శరీర తత్వానికి ఏది మంచిదో దానినే తినాలి. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.

ఈ మధ్యకాలంలో కూరల్లో కూరగాయలు తక్కువగా ఉంటున్నాయి. మసాలా గ్రేవీ లేదా చింతపండు రసం వంటివి సింహ భాగం కనిపిస్తున్నాయి. శాస్త్ర ప్రకారంలో కూరలో- కూరగాయ ముక్కలు ఎక్కువగా ఉండాలి. పోపు లేదా మసాలా తక్కువగా ఉండాలి. పోపు లేదా మసాలా వాసన కూరగాయలకు సహజంగా వచ్చే రుచిని చంపేయకూడదు.

క్యారెట్‌, ముల్లంగి, కీరా, టమోటా లాంటి శాకాల్ని వండకపోయినా తేలికగానే అరుగుతాయి. తక్కిన కూరగాయల్ని సుపక్వంగా అంటే చక్కగావండుకొని తినటమే మంచిది.

Updated Date - Jan 04 , 2025 | 04:16 AM