ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

cold sensitivity: చలి వేధిస్తోందా?

ABN, Publish Date - Jan 07 , 2025 | 04:01 AM

చలి కాలం చలి వేధించడం సహజమే! అయితే కొందరు కాస్త చలిని కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు.

చలి కాలం చలి వేధించడం సహజమే! అయితే కొందరు కాస్త చలిని కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు. తాపమానాలు ఏ కాస్త తగ్గినా చలితో బాధపడుతూ ఉంటారు. ఈ స్వభావం వెనక కొన్ని ఆసక్తికరమైన కారణాలున్నాయి. అవేంటంటే...

ఐరన్‌ లోపం: హిమోగ్లోబిన్‌ ఉత్పత్తికి అత్యంత ముఖ్యమైన ఖనిజలవణం ఐరన్‌. ఐరన్‌ లోపిస్తే, శరీరంలో కణజాలాలకు ఆక్సిజన్‌ సరఫరా జరగక, చేతులు, కాళ్లూ చల్లబడిపోతాయి.

థైరాయిడ్‌ సమస్యలు: మందకొడిగా పని చేసే థైరాయిడ్‌ వల్ల శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం తగ్గుతుంది. శరీరంలో వేడి జనించడానికి తోడ్పడే మెటబాలిజం కుంటుపడడంతో చలి వేధిస్తుంది.

మధుమేహం, హైపర్‌టెన్షన్‌: మధుమేహం వల్ల రక్త ప్రసరణ బలహీనపడి చేతులు, పాదాలకు రక్త ప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా చల్లదనం బాధిస్తుంది.

విటమిన్‌ బి12 లోపం: ఎర్ర రక్తకణాల ఉత్పత్తికీ, నాడుల పనితీరుకూ విటమిన్‌ బి12 కీలకం. ఈ పోషక లోపంతో, శరీరానికి అందే ఆక్సిజన్‌లో కొరత ఏర్పడి, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దాంతో చలి, నిస్సత్తువలు వేధిస్తాయి.

డీహైడ్రేషన్‌: వాతావరణ తాపమానాల క్రమబద్ధీకరణలో నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు, శరీర తాపమానం నిర్వహణ క్రమం తప్పి, సాధారణంగా కంటే చలి ఎక్కువవువుతుంది. కాబట్టి సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.

Updated Date - Jan 07 , 2025 | 04:01 AM