Share News

BATA: బాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు

ABN , Publish Date - Apr 04 , 2025 | 02:57 PM

అమెరికాలోని బే ఏరియా తెలుగు అసోసియేష‌న్‌ (బాటా) ఆధ్వర్యంలో విశ్వావసు నామ ఉగాది సంబరాలు అంగ‌రంగ వైభ‌వంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

BATA: బాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు
BATA Ugadi Celebrations

అమెరికాలోని బే ఏరియా తెలుగు అసోసియేష‌న్‌ (బాటా) ఆధ్వర్యంలో విశ్వావసు నామ ఉగాది సంబరాలు అంగ‌రంగ వైభ‌వంగా జరిగాయి. బే ఏరియాలోని తెలుగువారు నిర్వహించే అతి పెద్ద, అత్యంత ఆదరణ ఉన్న వేడుకలలో ఉగాది ఒకటి. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో ఉన్న ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో ఈ వేడుకలకు దాదాపు రెండు వేల మంది అతిథులు హాజరై సందడి చేశారు. ఉదయం 9 గంటలకు మొదలైన ఈ వేడుకలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి.

ఈ కార్యక్రమానికి ప్రజెంటర్‌గా సంజీవ్ గుప్తా సీపీఏ వ్యవహరించారు. ఈ ఈవెంట్‌కు నాగరాజ్ అన్నియ్య సహకారం అందించారు. ఈ ఈవెంట్ కు గోల్డ్ స్పాన్సర్‌గా శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్, పీఎన్ జీ జ్యూవెలర్స్ వ్యవహరించారు. ఇన్ స్టా సర్వీస్, శిఖా కపూర్(రియల్టర్) ఎంసీఎస్ మాస్టర్ క్లాస్, వచి సిల్క్స్, పాఠశాల (తెలుగు స్కూల్), మహాకాళేశ్వర్ ఆలయం మిగతా స్పాన్సర్లుగా వ్యవహరించారు. తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగింటి ఆభరణాలు, వస్త్రాలతో స్టాళ్లు అలరించాయి. రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్, ట్యాక్స్ సర్వీస్, ఎడ్యుకేషన్ స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ఆహూతులందరికీ షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని నిర్వాహకులు ఇచ్చారు.

2.jpg


ఈ ఏడాది రెండు హాళ్లలో నిర్వహించిన పోటీలకు అద్భుతమైన స్పందన వచ్చింది. క్లాసికల్ డ్యాన్స్, జానపద నృత్యం, పాటల పోటీలలో దాదాపు 500 మంది పిల్లలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ ఈవెంట్‌లో ప్రధానమై సాంస్కృతిక కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు మొదలైంది. బాటా సలహాదారు విజయా ఆసూరి అతిథులందరినీ సాదరంగా ఆహ్వానించారు. 250 మంది పిల్లల నృత్య ప్రదర్శనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో ముఖ్య విశేషాలు:

  • పూజారి ప్రదీప్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం

  • ఆనంద భైరవి (Kuchipudi Dance Ballet)

  • BATA పిల్లలు, బీట్స్ డ్యాన్స్ స్టూడియో (BDS) నృత్య ప్రదర్శనలు

  • సినిమా చూపిస్తా మామా (Rocking dance blend)

  • HIT 4 (హాస్యవల్లరి)

  • బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తో గేమ్ షో

  • టాలీవుడ్ సింగర్ దామిని తో లైవ్ కన్సర్ట్

తెలుగుజాతి సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాటా బృందాన్ని ఎన్నికైన అధికారులు అభినందించారు. గత ఏడాది నుంచి సేవలందిస్తున్న యువ వాలంటీర్లకు “ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డు (PVSA)” అందించారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వైట్ హౌస్ పీవీఎస్ ఏ పేరిట జాతీయ అవార్డులు అందజేస్తోంది.

3.jpg


ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కష్టపడిన బాటా బృందానికి, వాలంటీర్లందరికీ బాటా అధ్యక్షులు కొండల్‌రావు కొమరగిరి కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లుగా బాటా కమిటీ అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు చెప్పారు.

శివ కడా, వరుణ్ ముక్క, హరి సన్నిధిలతో కూడిన బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి ,సుమంత్ పుసులూరితో కూడిన “స్టీరింగ్ కమిటీ”...శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తిలతో కూడిన “సాంస్కృతిక కమిటీ”....సందీప్ కేదార్ శెట్టి, సురేష్ శివపురం, రవి పోచిరాజులతో కూడిన "లాజిస్టిక్స్ టీమ్"....సంకేత్, ఉదయ్, ఆది, గౌతమి, సింధూరలతో కూడిన యూత్ కమిటీ...కల్యాణి, కృష్ణప్రియ, దీప్తి, స్రవంతిలతో కూడిన ఆర్ట్ అండ్ డిజైన్ కమిటీ లను కొండల్ కొమరగిరి సభకు పరిచయం చేశారు.

4.jpg


ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాటా బృందానికి సంస్థ “సలహా మండలి” సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి అభినందనలు తెలిపారు. వీనుల విందైన సంగీతం, ఆటలు, పాటలు, ఆటల పోటీలు, డ్యాన్స్‌లు, ఆహ్లాదకరమైన పండగ వాతావరణంలో సాయంత్రం పూట ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన స్పాన్సర్లను వేదిక మీదక మీదకు పిలిచి బాటా కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. తానా కమిటీ సభ్యులు వెంకట్ కోగంటి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఏడాది జులైలో డెట్రాయిట్‌లో జరగనున్న తానా కాన్ఫరె‌న్స్‌కు వారిని ఆహ్వానించారు.

ఈ వేడుకల సందర్భంగా పాఠశాల బృందానికి ప్రత్యేకంగా గుర్తింపు లభించింది. తానా, బాటా ద్వారా తెలుగు భాషను ప్రోత్సహించడానికి, బోధించడానికి “పాఠశాల” ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్లు, అధ్యాపకులను సభికులు, అతిథులకు పరిచయం చేశారు.

ఇవి కూడా చదవండి:

బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది వేడుకలు

ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2025 | 02:57 PM