Canada PNP Invitations Issued: పర్మెనెంట్ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకోవాలంటూ కెనడా ఆహ్వానం
ABN , Publish Date - Apr 15 , 2025 | 07:59 PM
పీఎస్‌పీ ప్రోగ్రామ్ కింద ఏప్రిల్ 14న నిర్వహించిన ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రాలో ఎంపికైన అభ్యర్థులను పర్మెనెంట్ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకోవాలంటూ ఐఆర్‌సీసీసీ ఆహ్వానాలు పంపింది.

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో పర్మెనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అక్కడి వలసల, పౌరసత్వ శాఖ (ఐఆర్‌సీసీసీ).. ఎంపికైన విదేశీయులకు ఆహ్వానాలు పంపింది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సింస్టమ్‌లోని ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ కింద 825 ఆహ్వానాలను పంపింది.
ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పథకంలో భాగంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రతి రెండు వారాలకు ఐఆర్‌సీసీసీ డ్రా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి డ్రా నిర్వహణలో చాలా జాప్యం జరిగింది. దాదాపు నెల రోజుల పాటు జాప్యం తరువాత.. డ్రాలో ఎంపికైన 825 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆహ్వానాలు పంపింది. ఇక ఫ్రెంచ్ లాంగ్వెజ్ ప్రొఫిషియన్సీ కేటగిరీ కింద మార్చి 21న ఓ డ్రాను నిర్వహించారు. అంతకుముందు మార్చి 17న ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ కోసం మరో డ్రా నిర్వహించారు.
కెనడాలో శాశ్వత నివాసార్హత కోరుతున్న వారు ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ కింద ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎన్‌పీలో కూడా పలు ఉప కేటగిరీలు ఉన్నాయి. అభ్యర్థులకు ఉన్న జాబ్ ఆఫర్, వారి వృత్తికి కెనడాలో ఉన్న డిమాండ్, విద్యార్హతలు, పని అనుభవం తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వివిధ ప్రావిన్స్‌ల్లో ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించే విదేశీయులకు నివాసార్హత కల్పించేందుకు పీఎన్‌పీ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ప్రతి ప్రావిన్స్‌కు తనకంటూ కొన్ని వలసల పథాలు, కొన్ని కేటగిరీలు ఏర్పాటు చేసుకుంది. స్టూడెంట్స్, వ్యాపారవేత్తలు, నిపుణులైన ఉద్యోగులు, కార్మికులను పీఎన్‌పీ ద్వారా కెనడాలో శాశ్వత నివాసార్హత కల్పిస్తారు.
ఇక ఏప్రిల్ 14న నిర్వహించిన డ్రాలో సీఆర్ఎస్ కనీస స్కోరు 764, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి ఐటీఏలు అందాయి. టై బ్రేకింగ్ రూల్ కోసం 2024 ఆగస్టు 17న కటాఫ్‌గా ఎంపిక చేశారు. ఒకే తరహా కనీస స్కోరును ఉన్న అభ్యర్థుల్లో ఆగస్టు 17 కంటే ముందు ఎవరు దరఖాస్తు చేసి ఉంటే వారికి ఆహ్వానాలు అందాయి. ఇక మార్చి 17న జరిగిన డ్రాలో 536 మంది విదేశీయులకు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ఆహ్వానాలు అందాయి.
ఇవి కూడా చదవండి:
హంగ్‌కాంగ్‌లో వైభవంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
దుబాయిలో జై శ్రీరాం నినాదాలతో శ్రీ రామ నవమి ఉత్సవాలు
బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి