NRI: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
ABN, Publish Date - Jan 08 , 2025 | 06:08 AM
డల్లాస్ లో జరిగిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) గవర్నింగ్ బోర్డ్ సమావేశంలో 2025 వ సంవత్సరానికి నూతన కార్యవర్గం ఏర్పాటయింది. చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. డల్లాస్ లో లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి సంస్థ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
డల్లాస్ లో జరిగిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) గవర్నింగ్ బోర్డ్ సమావేశంలో 2025 వ సంవత్సరానికి నూతన కార్యవర్గం ఏర్పాటయింది. చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. డల్లాస్ లో లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి సంస్థ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. .ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వంటి గొప్ప సంస్థకు అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలోని ప్రతిష్టాత్త్మకమైన టాంటెక్స్ సంస్థ ను ముందుండి నడిపించే బాధ్యతను తన మీద పెట్టినందుకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు . పదవీ విరమణ చేస్తున్న 2024 పాలకవర్గం బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కు కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ.. క్రొత్త కార్య నిర్వాహక బృందానికీ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యులకూ చంద్ర శేఖర్ రెడ్డి పొట్టిపాటి ఆహ్వానం పలికారు. టాంటెక్స్ సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దీనికోసం కార్యనిర్వాహక సభ్య బృందము, పాలక మండలి నుండి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నానని అన్నారు.
నూతన కార్యవర్గం
అధ్యక్షులు: చంద్ర శేఖర్ రెడ్డి పొట్టిపాటి
ఉత్తరాధ్యక్షులు:మాధవి లోకి రెడ్డి
ఉపాధ్యక్షులు:ఉదయ్ కిరణ్ నిడిగంటి
కార్యదర్శి: దీప్తి సూర్యదేవర
సంయుక్త కార్యదర్శి:దీపికా రెడ్డి
కోశాధికారి : విజయ్ సునీల్ సూరపరాజు
సంయుక్త కోశాధికారి: లక్ష్మీ నరసింహ పోపూరి
తక్షణ పూర్వాధ్యక్షులు: సతీష్ బండారు
కార్య వర్గ సభ్యులు
లక్ష్మి ఎన్ కోయ, అర్పిత ఓబులరెడ్డి, స్రవంతి ఎర్రమనేని, రఘునాధరెడ్డి కుమ్మెత,ఆర్ బీ ఎస్ రెడ్డి, శివారెడ్డి వల్లూరు, రవి కదిరి, వీర లెనిన్ తుళ్లూరు, అనిత ముప్పిడి, చైతన్య రెడ్డి గాదె, పార్ధసారథి గొర్ల, శాంతి నూతి,రాజా ప్రవీణ్ బాలిరెడ్డి
పాలక మండలి బృందము
అధిపతి : డాక్టర్ కొండా తిరుమల రెడ్డి
ఉపాధిపతి:దయాకర్ మాడ
సభ్యులు
సురేష్ మండువ, డాక్టర్ శ్రీనాధ వట్టం, హరి సింగం, డాక్టర్ శ్రీనాథ్ పల్వల, జ్యోతి వనం
కొత్త పాలక మండలి, కార్యవర్గ బృందాల సూచనలు సహాయ సహకారాలతో సరికొత్త ఆలోచనలతో 2025 లో అందరినీ అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని స్థానికంగా ఉన్న తెలుగు వారి ఆశీస్సులు ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నామని సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి అన్నారు .పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షులు సతీష్ బండారు మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి నేతృత్వంలో ఏర్పడిన 2025 కార్యవర్గ బృందము నిర్వహించబోయే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాల్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.అదేవిధంగా 2024 పాలక మండలి అధిపతి సురేష్ మండువ యువత భాగస్వామ్యాన్ని పెంచి టాంటెక్స్ ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలను నిర్వ హించాలని సూచించారు. పాలకమండలి 2024 ఉపాధిపతి హరి సింగం నూతన బృందాన్ని అభినందించి ప్రతి కార్యక్రమానికి పాలక మండలి సభ్యుల మద్దతు ఉంటుందని తెలిపారు. 2025 పాలక మండలి అధిపతి డాక్టర్ కొండా తిరుమల రెడ్డి టాంటెక్స్ చేపట్టే అన్ని కార్యకలాపాలకు బోర్డు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. 2025 పాలక మండలి ఉపాధిపతి దయాకర్ మాడా నూతన కార్యవర్గాన్ని అభినందించి సంస్థ కార్యకలాపాలకు, సభ్యులకు పాలక మండలి తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Jan 08 , 2025 | 06:08 AM