CMYF Blood Donation Camp: ఒమాన్‌లో మెగాస్టార్ అభిమానుల రక్తదాన శిబిరం

ABN, Publish Date - Apr 05 , 2025 | 02:57 PM

సి.యం.వై.యఫ్ ఇటీవల మస్కట్‌లోని ప్రభుత్వ బషర్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలుగు ప్రవాసీయులు ఆశించిన దాని కంటే మిన్నగా స్పందించారు.

CMYF Blood Donation Camp: ఒమాన్‌లో మెగాస్టార్ అభిమానుల రక్తదాన శిబిరం
CMYF Blood Donation Camp in Gulf

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మనిషి సాటి మనిషికు ఇచ్చే అమూల్య బహుమానం రక్త దానం. ఈ అమూల్య దానం విషయమై మెగాస్టార్ చిరంజీవి అభిమానులు దేశంలోనే కాదు విదేశాలలో కూడా తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు.

గల్ఫ్‌లోని ఒమాన్‌లోని తెలుగు ప్రవాసీ సంఘమైన చిరు మెగా యూత్ ఫోర్స్ (సి.యం.వై.యఫ్) ఈ దిశగా ఒక్క గల్ఫ్ దేశాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి అభిమానులలో ఒక గుర్తింపు పొందింది. గత రెండు దశాబ్దాలుగా పైగా సంవత్సరానికి రెండు, మూడు సార్లు రక్తదానం చేస్తూ ఒమాన్ ప్రభుత్వ ప్రశంసలు, పురస్కారాలను కూడా పొందింది. మస్కట్‌లోని ప్రభుత్వ బషర్ బ్లడ్ బ్యాంకులో ఇటీవల సి.యం.వై.యఫ్ నిర్వహించిన రక్తదాన శిబిరానికి తెలుగు ప్రవాసీయులు ఆశించిన దాని కంటె మిన్నగా స్పందించారు.


తాము 110 యూనిట్ల రక్తాన్ని దానం చేసినట్లుగా సి.యం.వై.యఫ్ అధ్యక్షుడు చందక రాందాస్ ఒక ప్రకటనలో తెలిపారు. చిరంజీవి, రాంచరణ్, పవన్ కళ్యాణ్‌ల జన్మదినోత్సవాల సందర్భంగా, కొన్ని సార్లు ఇతర ప్రత్యేక సందర్భాలలో కూడ తమ సంఘం ఒమాన్‌‌లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుందని ఆయన వివరించారు.


రక్తాన్ని కృత్రిమంగా ఉత్పత్తి చేయలేరని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు స్వచ్ఛందంగా వారి శరీరం నుంచి దానం చేయవలసిందేనని ఆయన నొక్కి రాందాస్ చెప్పారు. ఒక వ్యక్తి తన జీవిత కాలం మొత్తం దాదాపు 168 సార్లు రక్తదానం చేయవచ్చని వివరించారు. సాధారణంగా, ఒక యూనిట్ రక్తాన్ని (సుమారు 300-350 మి.లీ) ఒకేసారి ఇవ్వవచ్చని, ఒక యూనిట్ రక్తాన్ని దానం చేస్తే రెండు రోజుల్లో దానిని భర్తీ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా ఒమాన్‌లోని ప్రవాసీయులు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని రాందాస్ కోరారు.

ఇవి కూడా చదవండి:

బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది వేడుకలు

ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2025 | 02:58 PM