ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దమ్మాంలో ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు

ABN, Publish Date - Jan 12 , 2025 | 08:46 PM

సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా నిర్వహించిన సంక్రాంతి ఉత్సవ్ -3 సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

  • శ్రీనివాస కళ్యాణోత్సవ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగు నాట సంక్రాంతి కళ క్రమేణా సన్నగిల్లి వ్యాపారత్మాక ధొరణి పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో ఎక్కడో విదేశాలలో పుట్టి పెరుగుతున్న నవ తరానికి సంక్రాంతితో అనుసంధానమైన పకృతి ఆరాధన, వ్యవసాయిక జీవన విధాన విలువల సంస్కృతి, సంప్రదాయాలు విశదీకరించే జరుగోతంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా నిర్వహించిన సంక్రాంతి ఉత్సవ్ -3 సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి (NRI).

సౌదీ అరేబియా పారిశ్రామిక నగరమైన దమ్మాంలో శుక్రవారం జరిగిన సంక్రాంతి ఉత్సవాలకు ఈశాన్య ప్రాంతంలోని తెలుగు ప్రవాసీయుల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ సంక్రాంతి క్రీడా, సాంస్కృతిక పోటీలకు ప్రవాసీయుల నుండి విశేష స్పందన లభించింది. రంగవల్లులు, గంగిరెద్దు విన్యాసాలు, హరిదాసు కీర్తనలతో సభా వేదిక అచ్చం ఊరి సంక్రాంతి వేడుకకు ప్రతీకగా నిలిచింది.


NRI: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

సంక్రాంతి వేడుకలకు తోడుగా శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని నిర్వహించడంతో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం తోడయింది. స్వల్ప వ్యవధి కోసం స్వదేశానికి వెళ్ళే ప్రవాసీయులు సమయాభావ కారణాన తిరుమలలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని వీక్షించలేని భక్తులకు సాటా నిర్వహించిన ఈ కళ్యాణోత్సవం కనువిందయింది. వేడుకలలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ప్రవాసీ విభాగం కన్వీనర్ మంద భీం రెడ్డి పాల్గొన్నారు. అందరూ కలిసి మెలిసి పండుగల సంతోషంతో పాటు కష్టాలలో ఉన్న తోటి ప్రవాసీయులను కూడా ఆదుకోవాలని కోరారు. శ్రీనివాస కళ్యాణోత్సవంలో సాటా ఈశాన్య ప్రాంత అధ్యక్షుడు తేజ పల్లెం సతీమణి వర్షితను శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణలో పద్మావతి అమ్మవార్ల వేషధారణలో నేహా శ్రీ పిరాతి, గోదా దేవి రూపంలో ప్రవీణలను చూసి ఏడు కొండల భక్తులు పరవశించి పోయారు. ఈ కార్యక్రమానికి లీలా అర్వింద్ దంపతులు దర్శకత్వం వహించారు.

హిందూ సనాతన ధర్మ విలువలను ప్రచారం చేస్తూ ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించిన ఈ కళ్యాణోత్సవ కార్యక్రమ నిర్వాహణలో లీలా అర్వింద్, ప్రవీణ, నేహా శ్రీ, ప్రణతి, కీర్తన, రాధా, నిహ్రియా, హర్షిత, శారోన్ లలిత ప్రియాలు ముఖ్యభూమిక వహించారు.

NRI: సౌదీలో సాటా ఆధ్వర్యంలో పండుగ సందడి


కోలాటంలో ఉత్తరాంధ్ర పెట్టింది పేరు. ఈ ప్రాంత వాస్తవ్యులు, సాటా మహిళ నాయకురాలు అయిన సంధ్య నేతృత్వంలో నిర్వహించిన కోలాటం సభికులను మంత్రముగ్ధులను చేసింది. జానపద కోలాటం నుంచి జడపాలి కోలాటం వరకు పలు రకాల ప్రదర్శనలను చేస్తోంది. భక్తి గీతాలు, సినిమా పాటలు, జానపద గీతాలకు తగినట్లు ప్రదర్శనలతో ఆకట్టుకుంటోంది.

విజయ, గౌరి, దివ్య, సూర్యలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు దర్శకత్వం వహించగా సన్నివేశాలకు అనుగుణంగా గౌరి, శిల్పా, శైలజ, తారక్, ప్రవీణలు వ్యాఖ్యాతలుగా వివరించిన తీరు కూడా అందర్నీ అబ్బురపరిచింది. రాకేశ్, రాం, కృష్ణా మరియు ప్రాధు లైటింగ్ అండ్ సౌండ్స్ నిర్వహణ కార్యక్రమానికి ఊతమిచ్చింది. జగదీశ్, రవి, రాంబాబు మరియు తారక్‌లు మూడు పూటల భోజన కార్యక్రమాలలో అన్ని తామై వ్యవహరించారు. భారత్, కయాల, శ్రీనివాస్, సంతోషిలు లక్కీ డ్రాకు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. అచ్చం గోదావరి గ్రామాలుగా సభా వేదికను సురేశ్, రాధా, సతీష్, సుబ్బు, విశాల్, సౌజన్య, జయ శ్రీలు అలంకరించగా లక్ష్మీ నారాయణ, శ్రీకాంత్‌లు రవాణా ఏర్పాట్లను పరిశీలించారు.

New Zealand Visa Rules: కార్మికుల కొరత.. న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో కీలక మార్పులు


హైందవ ధర్మంలో సంక్రాంతి పండుగకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడా విభిన్న సంప్రదాయాలలో జరుపుకుంటారు. ఈ కారణాన ఈసారి దమ్మాంలో జరిగిన సంక్రాంతి సంబురాలను కాస్త సంక్రాంతి ఉత్సవ్‌గా మార్చడంతో పెద్ద సంఖ్యలో గుజరాతీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాసీయులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నారులతో నిర్వహించిన ‘హం ఇండియా వాలే’ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి.

సౌదీలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పండుగను తమ సంఘం సాటా కుటుంబాల కలయికగా ఆత్మ యతనంతో నిర్వహిస్తున్నట్లుగా సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేశన్ వెల్లడించారు. ప్రతి పండుగలో ప్రతి తెలుగు కుటుంబం పూర్తిగా భాగస్వామ్యం చేయడంలో తాము సఫలీకృతులం అవుతున్నట్లుగా మల్లేశన్ పెర్కోన్నారు.

సౌదీ అరేబియాలోని తెలుగు కుటుంబాలు ఆతృతతో ఎదురు చూసే వైభవ తెలుగు పండుగలలో సంక్రాంతి ఒకటని, దీన్ని మూడు సంవత్సరాల నుండి అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా సాటా ఈశాన్య ప్రాంత ప్రతినిధులు తేజ, అర్వింద్, రాజేశ్, శ్రవణ్, ఓం ప్రకాశ్‌లు తెలిపారు.

Read Latest and NRI News

Updated Date - Jan 12 , 2025 | 08:56 PM