NRI: సౌదీలో సాటా ఆధ్వర్యంలో పండుగ సందడి
ABN, Publish Date - Jan 06 , 2025 | 03:53 PM
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రా పల్లెల్లో ఉండే హడావుడి ఇప్పుడు గల్ఫ్ దేశాలలోని తెలుగు ప్రవాసీ కుటుంబాల్లోనూ కనిపిస్తోంది. జనవరి చివరి చలి గాలులు మొదలు కావడమే ఆలస్యం సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘం సాటా ఆధ్వర్యంలో పండుగ సందడి మొదలయింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సంక్రాంతి సందర్భంగా ఆంధ్రా పల్లెల్లో ఉండే హడావుడి ఇప్పుడు గల్ఫ్ దేశాలలోని తెలుగు ప్రవాసీ కుటుంబాల్లోనూ కనిపిస్తోంది. జనవరి చివరి చలి గాలులు మొదలు కావడమే ఆలస్యం సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘం సాటా ఆధ్వర్యంలో పండుగ సందడి మొదలయింది (NRI).
సంక్రాంతి పిండి వంటలు, బోగి పళ్ళు, గొబ్బెమ్మల పాటలు, భోగి మంటల విశిష్ఠతను వివరిస్తూ దమ్మాం, ఖోబర్, దహ్రెన్, జుబేల్ నగరాలలోని అనేక తెలుగు కుటుంబాలు కలిసి బృందాలుగా సన్నాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం సాటా ఆధ్వర్యంలో దమ్మాం నగరంలో నిర్వహించే సంక్రాంతి సంబురాలకు పెద్ద ఎత్తున తెలుగు ప్రవాసీ లోకం కదలివస్తోంది.
New Zealand Visa Rules: కార్మికుల కొరత.. న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో కీలక మార్పులు
గత సంవత్సర కాలంగా ఉపాధి రీత్యా పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి వచ్చిన తెలుగు కుటుంబాలు ప్రవాసంలో ప్రప్రథమంగా సంక్రాంతి పరాయి గడ్డపై తోటి తెలుగు వారితో జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వందలాది మంది తోటి తెలుగు కుటుంబాలతో కలిసి సంక్రాంతి జరుపుకోవడానికి విజయనగరం జిల్లాకు చెందిన గోపికృష్ణా, విజయవాడ నగరానికి చెందిన దేవరం సతీష్‌లు గత కొన్ని వారాలుగా సంసిద్ధులవుతున్నారు. హైదరాబాద్‌లోని తమ కాలనీ సంబరాల తరహాలో సౌదీలో సంక్రాంతి జరుపుకోవాలనుకోవడం తమకు ఎనలేని అనుభూతి కలిస్తుందని హైదరాబాద్ నగరానికి చెందిన అనిల్ కుమార్ అన్నారు.
Jagdeep Singh: ప్రపంచంలో అత్యధిక శాలరీ తీసుకుంటున్న ఉద్యోగి మనోడే! శాలరీ ఎంతో తెలిస్తే..
ఈ సారి గతంలో కంటే భారీగా సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేసినట్లుగా సాటా ముఖ్యులు మల్లేశన్, తేజలు తెలిపారు. మరిన్ని వివరాల కొరకు 0597384449 లేదా 0556448999 నెంబర్లపై సంప్రదించవ్చని వారన్నారు.
Updated Date - Jan 06 , 2025 | 03:53 PM