MLA Vamsi Krishna: బే ఏరియాలో జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ పర్యటన

ABN, Publish Date - Apr 04 , 2025 | 10:32 PM

అమెరికాలోని బే ఏరియాలో పర్యటించిన విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ స్థానిక ఎన్నారైలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MLA Vamsi Krishna: బే ఏరియాలో జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ పర్యటన
MLA Vamsi Krishna

అమెరికాలోని బే ఏరియాలో విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా బే ఏరియాలో ఎన్నారైలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫ్రీమాంట్‌లో భీమవరం రుచులు రెస్టారెంట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన ఎన్నారై నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మూర్తి నిర్వహించారు. అతిథులందరికీ శ్రీకాంత్ దొడ్డపనేని విందు భోజనం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్సీగా తనకు నాలుగేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. జగన్ వైఖరి నచ్చకే వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరానని తెలిపారు. ఆ తర్వాత విశాఖ సౌత్ అభ్యర్థిగా తనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవకాశం కల్పించరాని చెప్పారు. కూటమి పార్టీలపై నమ్మకంతో 65 వేల భారీ మెజారిటీతో తనను ఉత్తరాంధ్ర ప్రజలు గెలిపించారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల పాలనలో తమ ప్రాంతం అభివృద్ధి చెందడంపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.


ఈ కార్యక్రమంలో వీరబాబు, కళ్యాణ్ పల్లా, రమేష్ తంగిళ్లపల్లి, భక్త, వెంకట్ అడుసుమల్లి, సుబ్బా యంత్రా, లక్ష్మణ్, నారాయణ, వెంకట్, రామ్, సతీష్, రవి కిరణ్, హరి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది వేడుకలు

ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2025 | 10:32 PM