భద్రాచలం: కోదండాముడి పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్.. పట్టువస్త్రాల సమర్పణ..

ABN, Publish Date - Apr 07 , 2025 | 08:36 PM

భద్రాచలం: భద్రాచలంలో కోదండరాముని పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా కల్యాణ మండపంలో కన్నులపండువగా సాగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై పూజలు నిర్వహించారు.

భద్రాచలం:  కోదండాముడి పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్.. పట్టువస్త్రాల సమర్పణ.. 1/5

భద్రాచలంలో శ్రీరాముల వారి మహాపట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా కళ్యాణ మండపంలో సీతారామచంద్రుడికి అర్చకులు పట్టాభిషేకం నిర్వహించారు.

భద్రాచలం:  కోదండాముడి పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్.. పట్టువస్త్రాల సమర్పణ.. 2/5

ప్రతీఏటా స్వాముల వారి కళ్యాణం అనంతరం మహాపట్టాభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

భద్రాచలం:  కోదండాముడి పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్.. పట్టువస్త్రాల సమర్పణ.. 3/5

పట్టాభిషేకంలో భాగంగా రాములవారికి పాదుకలను సమర్పించారు అర్చకులు. రాజదండం, రాజ ముద్రిక, రాజ ఖడ్గం, ఛత్రం, చామరలు, రామదాసు పచ్చల పతకాన్ని శ్రీరాముడికి అలంకరించారు. ఆపై ఆ రామయ్యకు కిరీటాన్ని అలంకరించారు.

భద్రాచలం:  కోదండాముడి పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్.. పట్టువస్త్రాల సమర్పణ.. 4/5

మహా పట్టాభిషేక మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ మహోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

భద్రాచలం:  కోదండాముడి పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్.. పట్టువస్త్రాల సమర్పణ.. 5/5

కాగా.. రాముల వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు సోమవారం ఉదయం సారపాకకు చేరుకున్న గవర్నర్‌కు హెలిప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల స్వాగతం పలికారు. ఆపై మిథిలా కళ్యాణ మండపానికి చేరుకున్న గవర్నర్‌కు ఆలయ మర్యాదలతో అర్చకులు, మంత్రి తుమ్మల స్వాగతం పలికారు.

Updated at - Apr 07 , 2025 | 08:36 PM