త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు
ABN, Publish Date - Apr 13 , 2025 | 08:52 PM
త్వరలో భౌగోళిక రాజకీయ అస్థిరత తగ్గి బంగారం ధరలు నేలకు దిగొచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సామాన్యులకు ధరాభారం నుంచి ఊరట దక్కుతుందని భరోసా ఇస్తున్నారు.

కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు చూసి మధ్యతరగతి వర్గాలు భయపడిపోతున్నాయి. జనాలు బంగారం షాపుల వంక చూడటం కూడా మానేశారు

భవిష్యత్ అవసరాల కోసం బంగారాన్ని కూడ బెట్టుకోగలమా అన్నా ఆందోళన సామాన్యులను ముంచెత్తుతోంది

ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.94 వేలు, లక్ష మార్కు దాటే అవకాశం ఉందని కూడా జనాలు అంటున్నారు

ట్రంప్ సుంకాల భయమే గోల్డ్ రేట్స్ పెరగడానికి ప్రధాన కారణం

త్వరలో బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయని కూడా కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత పెట్టే ఛాన్స్ ఉండటంతో డాలర్‌కు డిమాండ్ పెరుగుతుందని, ఈ క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగితే బంగారం ధర తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుటపడి బంగారం ధరలు కూడా దిగిరావచ్చని నిపుణులు చెబుతున్నారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ముగింపు పడితే బంగారం ధరలు మరింత తగ్గొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఫలితంగా బంగారం ధరల్లో కనీసం 15 శాతం కోత పడుతుందని చెబుతున్నారు. ఇది జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
Updated at - Apr 13 , 2025 | 08:52 PM