ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అద్భుతం.. ఆకాశం నుంచి వచ్చి లైటర్ ఇచ్చాడు.. వైరల్ అవుతున్న వీడియో..

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:40 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Paraglider in Goa

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పారా గ్లైడింగ్ (Paragliding) చేస్తున్న ఓ వ్యక్తి కిందకు వచ్చి నేల మీద ఉన్న వ్యక్తితో సంభాషించి తిరిగి పైకి వెళ్లాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారు నవ్వుకుంటున్నారు (Viral Video).


z.in.morjim అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను గోవాలో సూర్యాస్తమయం సమయంలో చిత్రీకరించారు. ఓ వ్యక్తి పారా గ్లైడింగ్ చేస్తూ ఓ కొండకు దగ్గరగా వచ్చాడు. ఆ సమయంలో ఆ కొండ మీద ఉన్న వ్యక్తి.. ఆ పారా గ్లైడర్‌ (paraglider)ను ఉద్దేశించి.. ``భయ్యా.. నీ దగ్గర లైటర్ ఉందా`` అని అడిగాడు. దీంతో ఆ పారా గ్లైడర్ తన జేబులో ఉన్న లైటర్‌ (Lighter)ను తీసి కొండ మీద ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి దానిని ఇచ్చి మళ్లీ తిరిగి వెళ్లిపోయాడు. తిరిగి వెళ్లేటపుడు ``నేను వచ్చాక మళ్లీ లైటర్ ఇచ్చెయ్`` అని చెప్పాడు. ఈ ఘటన మొత్తాన్ని ఆ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు. 22 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అద్భుతమైన స్కిల్. నేరుగా వచ్చి చేతులో పెట్టి వెళ్లిపోయాడు``, ``ఆ వ్యక్తి తన ట్యాలెంట్‌ను అద్భుతంగా ప్రదర్శించాడు``, ``ఎంతో ట్యాలెంట్ ఉంటే తప్ప అలా పారాగ్లైడింగ్ చేయడం కష్టం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Anand Mahindra: ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. 90 గంటల పని విధానంపై ఆనంద్ మహీంద్రా విసుర్లు..


Teacher`s Whisky: టీచర్స్ విస్కీకి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? దాని వెనుకున్న 175 ఏళ్ల చరిత్ర ఏంటంటే..


Viral Video: స్వర్గంలో ప్రయాణం.. 4 వేల కి.మీ. జర్నీ.. రూ. 1.5 లక్షల టిక్కెట్.. ఎక్కడో తెలుసా?


Optical Illusion Test: వర్షం పడుతోంది.. ఈ పిల్లల గొడుగు ఎక్కడుందో 5 సెకెన్లలో గుర్తించి చెప్పండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 12 , 2025 | 12:40 PM