Anant Ambani: అనంత్ అంబానీ స్పెషల్ వాచ్ చూశారా? ఆ వాచ్ ఖరీదు ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
ABN , Publish Date - Jan 01 , 2025 | 07:35 PM
ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి వాచీలు అంటే చాలా ఇష్టం. అనంత్ దగ్గర ఇప్పటికే కోట్ల ఖరీదు చేసే వాచీలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల అనంత్ తన భార్య రాధికతో కలిసి ఓ కార్యక్రమంలో కనిపించారు. అప్పుడు ఆయన చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) చిన్న కొడుకు అనంత్ అంబానీ (Anant Ambani)కి వాచీలు అంటే చాలా ఇష్టం. అనంత్ దగ్గర ఇప్పటికే కోట్ల ఖరీదు చేసే వాచీలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల అనంత్ తన భార్య రాధికతో కలిసి ఓ కార్యక్రమంలో కనిపించారు. అప్పుడు ఆయన చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. నీలం రంగు డయల్‌తో ఐస్ క్యూబ్ (Expensive ice-cube Watch) మాదిరిగా ఉన్న ఆ వాచ్ ధగధగా మెరుస్తూ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆ వాచ్ గురించి చాలా మంది ఆరాలు తీయడం మొదలుపెట్టారు. (Anant Ambani Watch)
ఆ వాచ్ గురించిన విశేషాలు వింటే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. రిచర్డ్ మిల్లే బ్రాండ్‌కు చెందిన ఆ వాచీ ధర ఏకంగా 22 కోట్ల రూపాయలట. ఇంకో విశేషమేమిటంటే.. అలాంటి వాచీలు కేవలం మూడే ఉన్నాయట. ఆ మూడింట్లో ఒకటి అనంత్ అంబానీ దగ్గర ఉందన్నమాట. రిస్ట్ వాచీలపై అనంత్‌కు మక్కువ ఎక్కువ అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే అనంత్ దగ్గర పటెక్ ఫిలిప్పె, అడెమార్స్ పిగ్యుట్ వంటి ఖరీదైన బ్రాండ్లకు చెందిన మోడళ్లు ఉన్నాయి. పెళ్లిలో అనంత్ ధరించిన వాచీ ధర రూ.60 కోట్లు అని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ వాచ్‌ను అనంత్ కోసమే సదరు కంపెనీ తయారు చేసిందట. ఇక, కొన్ని నెలల క్రితం వైభవోపేతంగా జరిగిన తన వివాహానికి హాజరైన స్నేహితులు, ఆత్మీయులకు కూడా అనంత్ ఖరీదైన వాచీలను బహుమతులుగా అందించాడు. అడెమార్స్ పిగ్యుట్ బ్రాండ్‌కు చెందిన ఆ ఒక్కో వాచ్ ధర రూ.2 కోట్లు. అంతేకాదు.. అనంత్ ఖరీదైన వాచీలను కొనేందుకే ఎక్కువ మక్కువ చూపుతాడు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. ప్రమాదం కూడా ఇతడిని చూస్తే భయపడుతుందేమో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చూడండి..
Viral Video: కోట్లు విలువ చేసే కారు.. ఎడ్లబండి సహాయం లేకపోతే బయటకు రాలేకపోయింది.. వీడియో వైరల్..
Viral Video: కళ్లెదురుగానే మోసం.. యాపిల్స్ అమ్ముకునే వ్యక్తి ఎలా ఛీటింగ్ చేస్తున్నాడో చూస్తే..
IQ Test: ఈ ఆది మానవుల మధ్య ఒక ఆధునికుడు ఉన్నారు.. అది ఎవరో కనిపెడితే మీ బ్రెయిన్ సూపర్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..