ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కళ్లెదురుగానే మోసం.. యాపిల్స్ అమ్ముకునే వ్యక్తి ఎలా ఛీటింగ్ చేస్తున్నాడో చూస్తే..

ABN, Publish Date - Jan 01 , 2025 | 03:38 PM

తూకం విషయంలో మోసాల గురించిన వీడియోలు ఇప్పటికే ఎన్నో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలోని వ్యక్తి చాకచక్యంగా మోసం చేయడాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Cheating

మార్కెట్లోకి వెళ్లి ఏదైనా కొనేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్తకుడు ఏం చేస్తున్నాడో క్షుణ్నంగా గమనించాలి. లేకపోతే కళ్లెదురుగానే మోసాలు (Cheating) చేసేవారు చాలా మంది ఉంటారు. మనం ఎంచుకున్నవి కాకుండా వేరే పాడైపోయినవి ఇచ్చేవాళ్లు ఎందరో ఉంటారు. ఇక, తూకం విషయంలో మోసాల గురించిన వీడియోలు ఇప్పటికే ఎన్నో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలోని వ్యక్తి చాకచక్యంగా మోసం చేయడాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@introvert_hu_ji అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బండి మీద యాపిల్స్ (Apples) పెట్టుకున్న అమ్ముతున్న వ్యక్తి దగ్గరకు కొందరు వచ్చారు. తమకు నచ్చిన యాపిల్స్ ఏరుకుని వాటిని కవర్లో వేసి ఇస్తున్నారు. అయితే ఆ వర్తకుడు చాకచక్యంగా వారు ఇచ్చిన కవర్‌ను పక్కన పెట్టేసి తన దగ్గరున్న ఉన్న కవర్‌ను తూకం వేస్తున్నాడు. కొనుగోలుదార్లు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ``ఇది వ్యాపారం`` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.8 లక్షల మందికి పైగా వీక్షించారు. 15 వందల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది వ్యాపారం కాదు.. మోసం``, ``కస్టమర్లు ఎంచుకున్న మంచి యాపిల్స్ కాకుండా పాడైపోయినవి ఇస్తున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: భారతీయ మహిళలతో పెట్టుకుంటే.. ఈవీ కార్‌ను ఇలా కూడా వాడుకోవచ్చా.. వీడియో వైరల్..


Viral Video: ఇలాంటి తెలివి భారతీయులకే సాధ్యం.. బైక్‌ హ్యాండిల్‌కు ఆ సంచులు ఎందుకు తగిలించాడో తెలిస్తే..


Viral Video: విచిత్రమైన ఫ్రెండ్‌షిప్.. కుక్క, పీత కలిసి ఏం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్..


Viral Video: వామ్మో.. ఎలక్ట్రిక్ వైర్లపై బట్టలు ఆరేస్తున్నాడు.. కిందనున్న వ్యక్తి అడిగితే ఏం చెప్పాడంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 01 , 2025 | 03:38 PM