Share News

Auto Rickshaw: ఈ ఆటో ఎక్కితే.. విమానంలో ఉన్నట్లే ఫీలవుతారు

ABN , Publish Date - Apr 13 , 2025 | 02:50 PM

మీ దగ్గర ఎమిరేట్స్ విమానం ఎక్కడానికి సరిపడా బడ్జెట్ లేదా.. అయితే నో ప్రాబ్లం.. ఈ ఆటో ఎక్కితే.. మీరు విమానంలో ప్రయాణించినట్లే ఫీలవుతారు. ఆ వివరాలు..

Auto Rickshaw: ఈ ఆటో ఎక్కితే.. విమానంలో ఉన్నట్లే ఫీలవుతారు
Auto

ఇప్పుడంటే చాలా రాష్ట్రాల్లో ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో.. ఆటోలకు పెద్దగా గిరాకీ ఉండటం లేదు. కానీ కొన్నాళ్ల క్రితం వరకు ఆటోలు ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండేవి. ఇక కొందరు ఆటో డ్రైవర్లు.. ప్రయాణికులను ఆకర్షించడం కోసం సీజన్లకు తగ్గట్టుగా తమ ఆటోల్లో సౌకర్యాలు కల్పిస్తుండేవారురు. వర్షా కాలంలో ప్రయాణికులు తడవకుండా.. చుట్టూ పరదాలు ఏర్పాటు చేస్తే.. వేసవికాలంలో ఎండ తీవ్రత నుంచి కాపాడే చర్యలు తీసుకుని ప్రయాణికులను ఆకర్షిస్తుంటారు.

అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆటో అంతకు మించి. ఈ ఆటో ఎక్కితే విమానంలో ఎలాంటి సౌకర్యాలుంటాయో.. అవన్ని మీ కళ్ల ముందు కనిపిస్తాయి. ఫ్రీ వైఫై, చదువుకోవడానికి మ్యాగ్‌జైన్స్‌తో పాటుగా ట్యాబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతతోంది. ఆ వివరాలు..


ఏవియేషన్ న్యూస్ అనే ఇన్‌స్టా ఖాతాలో.. మీరు ఎమిరెట్స్ విమానం ఎక్కలేకపోవచ్చు..కానీ దీని ఖర్చును మాత్రం భరించగలరు అనే క్యాప్షన్‌తో ఆటోలోని సౌకర్యాలను చూపించే వీడియో పోస్ట్ చేశారు. ఇక ఈ ఆటోలో ఉన్న సదుపాయాలు, సౌకర్యాలు చూసి ప్రయాణికులే కాదు నెటిజనులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ఆటోలో ఉచిత వై-ఫైతో పాటుగా అనేక ఇతర సౌకర్యాలు కల్పించబడ్డాయి. దాని లోపల చాలా ట్యాబ్స్, మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి.


వీటితో పాటుగా ఈ ఆటో ఎక్కిన ప్రయాణికులు ఉచితంగా వైఫై వాడుకోవచ్చు.యూజర్ నేమ్, పాస్వార్డ్ ఎదురుగా అందరికి కనిపించేలా రాసి ఉంటుంది. అలానే రెండు ట్యాబ్స్, మ్యాగ్‌జైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఆటో ఎక్కితే మీకు ప్రీమియం ప్రయాణ అనుభవం కలగడం పక్కా అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజనులు. ఇది కేవలం ఆటో కాదు, ఎమిరేట్స్ విమానం..అంటూ కామెంట్‌ చేస్తున్నారు. సదరు ఆటో డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Yusuf Pathan: ఓ పక్క రాష్ట్రం తగలబడుతుంటే.. చాయ్ తాగుతూ ఫోజులా.. మాజీ క్రికెటర్‌పై విమర్శలు

Disadvantages of AC : మీరు రోజంతా ACలోనే ఉంటున్నారా..నష్టాలు ఏంటో తెలుసుకోండి..

Updated Date - Apr 13 , 2025 | 02:54 PM