Share News

Sankranti 2025: సంప్రదాయం వెనుక సైన్స్.. భోగి పండుగ విశిష్టత ఇదే..

ABN , Publish Date - Jan 13 , 2025 | 09:38 AM

Bhogi Festival: భోగి పండుగ రోజు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. సంక్రాంతి సమయంలో కొత్త పంట రావడంతో పొలాల నుంచి క్రిమి కీటకాలు ఇళ్లలోకి వస్తాయి. భోగి మంటలు వేయడంతో అవి ఇళ్లలోకి రావు. అలాగే సాయంకాలం చిన్నారులపై భోగి పళ్లు పోస్తారు.

Sankranti 2025: సంప్రదాయం వెనుక సైన్స్.. భోగి పండుగ విశిష్టత ఇదే..
Bhogi Festival

తెలుగు ప్రజలు ఎంతో విశిష్టంగా జరుపుకునే అతి పెద్ద పండుగ మకర సంకాంత్రి. మకర సంక్రాంతి పండుగ భోగితో మొదలవుతుంది. మకర సంక్రాంతి పండగకు ముందు భోగి పండుగను జరపుకుంటారు తెలుగువారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున జరుపుకునే మకర సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగను నాలుగు రోజులు పాటు జరుపుకుంటారు. కుటుంబసభ్యులంతా ఒక్కచోట చేసి ఈ పండును ఆనందాల నడుమ జరుపుకుంటారు. ప్రతీ ఏడాది జనవరి 13, 14, 15 , 16 తేదీల్లో ఈ ఫెస్టివల్‌ను జరుపుకుంటారు. జనవరి 13న భోగి, జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 15న కనుమ అని పిలుస్తుంటారు. అలాగే 16న ముక్కనుమగా పండుగను నిర్వహిస్తారు. ప్రధానంగా భోగి మంటలతో భోగి పండుగను చేస్తారు. దక్షిణాయనంలో సూర్యుడు ఉండే చివరి రోజు భోగి. దక్షిణాయనంలో పడిన కష్టాలు తొలగిపోయి ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలు కలగడమే భోగి పండుగ విశిష్టత. ఈ చలి తీవ్రతను తట్టుకునేందుకు ప్రజలు భోగి మంటలను వేస్తుంటారు. భోగి పండుగ రోజు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. సంక్రాంతి సమయంలో కొత్త పంట రావడంతో పొలాల నుంచి క్రిమి కీటకాలు ఇళ్లలోకి వస్తాయి. భోగి మంటలు వేయడంతో అవి ఇళ్లలోకి రావు. అలాగే సాయంకాలం చిన్నారులపై భోగి పళ్లు పోస్తారు. హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలకు ముందు వచ్చే రోజును భోగిగా జరపుకుంటారు. శివరాత్రి, దీపావళి, దసరా ముందు రోజును భోగి అని పిలుస్తారు. భోగి మంటల్లో చెడును తగులబెట్టి.. మంచిని పెంచుకోవడమే ఈ పండుగ పరమార్థం.


చలికే కాదు.. ఆరోగ్యపరంగా కూడా

bhogi.jpg

భోగిమంటలకు ఎక్కువగా తాటాకులను వాడుతుంటారు. ఈ భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులను వేస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఇళ్ల ముందు భోగి మంటలు వేస్తారు. భోగి మంటల కోసం ముందు రోజే అన్నీ సిద్ధం చేస్తారు. భోగి రోజు పొద్దున్నే స్నానమాచరించి, కొత్త బట్టలు ధరించి మరీ ఎంతో నిష్టగా భోగి మంటలు వేయాలి. హోమాన్ని ఎంత పవిత్రంగా చేస్తారో భోగి మంటలను అంతే శుద్ధిగా చేసుకోవాలి. భోగి మంటల కోసం ముందే సిద్ధం చేసిన పిడకల మీద ఆవు నెయ్యి, కర్పూరంతో వెలిగిస్తే మంచిదని చెబుతుంటారు. చిన్నా, పెద్దా అంతా భోగి మంటల చుట్టూ చేరి ఆడి పాడుతుంటారు. భోగి మంటల నుంచి వచ్చే సెగతో చలిని కాచుకుంటారు. భోగి మంటల వల్ల చలి తగ్గడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. భోగి మంటలకు ఉపయోగించిన పిడకలు కాల్చడం వల్ల అందులో నుంచి వచ్చే గాలిని పీల్చడం ద్వారా శ్వాసకోస సంబంధింత రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతే కాకుండా భోగి మంటల వల్ల సూక్ష్మ క్రిములు నశిస్తాయి.

ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం


భోగి పళ్లతో ఆశీర్వాదం..

bhogi-pallu.jpg

భోగి పండుగ రోజు పిల్లలకు భోగి పళ్లు పోస్తుంటారు. పిల్లల మీదున్న చెడు దిష్టి పోవాలనే ఉద్దేశంతో వారిపై రేగిపళ్లను పోసి ఆశీర్వదిస్తారు. రేగు పళ్లు, చెరకు గడలు, బంతిపూలు, చిల్లర నాణేలను భోగి పండ్లుగా వాడతారు. ఇలా చేస్తే ఆ నారాయణుడి అనుగ్రహం పిల్లలకు లభిస్తుందని.. ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. అలాగే ఈరోజు కొందరు బొమ్మల కొలువును కూడా నిర్వహిస్తారు.


భోగి వంటకాలు...

bhogi-vantalu.jpg

సంక్రాంతి పండుగను పురస్కించుకుని ఈరోజు మూడు రోజులు విశేషమైన వంటకాలు చేస్తారు. ముఖ్యంగా భోగి రోజు కొత్తగా వచ్చిన పంటతో పొంగలి చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మరికొందరు రొట్టెలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కలగూరను వండుతారు. అంటే అన్ని కూరగాయలను కొంచెం కొంచెం తీసుకుని కలగూరగా వండుతారు ప్రజలు.


ఇవి కూడా చదవండి...

ఈ రాశి వారికి షాపింగ్‌, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి

బొమ్మల మధ్యన నిజమైన గుడ్లగూబ ఎక్కడుంది..

Read Latest Pratyekam News And Telugu News

Updated Date - Jan 13 , 2025 | 10:41 AM